బుధవారం 30 సెప్టెంబర్ 2020
Science-technology - Sep 14, 2020 , 16:56:56

స‌రికొత్త స్పీక్‌750 స్పీక‌ర్‌ను విడుద‌ల చేసిన జ‌బ్రా.. ధ‌ర ఎంతో తెలుసా?

స‌రికొత్త స్పీక్‌750 స్పీక‌ర్‌ను విడుద‌ల చేసిన జ‌బ్రా.. ధ‌ర ఎంతో తెలుసా?

భారతదేశంలో ప్రొఫెషనల్ స్పీకర్ ‌ఫోన్‌ల కంపెనీ జ‌బ్రా సోమ‌వారం స‌రికొత్త మోడ‌ల్‌ను విడుద‌ల చేసింది. భారతదేశంలో కొత్తగా స్పీక్ 750 పేరుతో స్పీక‌ర్‌ను ప్రారంభించింది. దీని ధ‌ర రూ.40,996 గా నిర్ణ‌యించ‌గా ఇది జ‌బ్రా అధికారిక వెబ్‌సైట్‌లో ల‌భించ‌నుంది. 

జ‌బ్రా త‌న కొత్త స్పీక్ 750లో ఫోన్ కాన్ఫరెన్స్ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. కొత్తగా ప్రారంభించిన ఈ పరికరం శబ్దాలను సులువుగా గ్ర‌హించ‌గ‌ల‌దు. ఇది గదిలో ఉంత మంది.. ఎంత దూరంలో ఉన్నా ఒకేసారి మాట్లాడటానికి, వీలు కల్పిస్తుంది. ఈ కొత్త స్పీక్750 స్పీకర్ యుఎస్‌బీ కేబుల్, బ్లూటూత్ అడాప్టర్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, పీసీల‌కు క‌నెక్ట్ అవుతుంది. వినియోగదారులు దీన్ని ఎనిమిది పరికరాలతో జత చేయవచ్చు.  ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. ఇది స్పీకర్ ఫోన్, బ్లూటూత్ అడాప్టర్ మధ్య 30 మీటర్ల వరకు వైర్‌లెస్ పరిధిని, స్పీకర్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ మధ్య 10 మీటర్ల వరకు వైర్‌లెస్ ప‌రిధిని క‌లిగి ఉంటుంది.

అన్ని ప్రముఖ యూనిఫైడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లకు అనుకూలంగా ఉండే ఈ స్పీక్ 750 యూసీ వేరియంట్‌ను కూడా క‌లిగి ఉంది. సిరి, గూగుల్ అసిస్టెంట్ లేదా స్పీడ్ డయల్ కోసం ప్రోగ్రామ్ చేయగల స్మార్ట్ బటన్‌ను కలిగి ఉంది. ఈ అన్ని లక్షణాలతో పాటు స్పీక్ 750లో హైఫై గ్రేడ్ స్పీకర్లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అధునాతన 40సౌండ్ సామ‌ర్థ్యం కోసం ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. దీని బ్యాట‌రీ 11 గంట‌ల వ‌ర‌కు బ్యాక‌ప్ ఇస్తుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo