శనివారం 08 ఆగస్టు 2020
Science-technology - Jul 14, 2020 , 22:13:47

నిరంతర నిఘాకు ఇజ్రాయెల్‌ డ్రోన్లు

నిరంతర నిఘాకు ఇజ్రాయెల్‌ డ్రోన్లు

ఢిల్లీ :  భారత సరిహద్దులను పటిష్టంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకొంటుంది. అనుక్షణం అప్రమత్తంగి ఉండాటానికి కావలసిన నిఘా ఏర్పాటు, ఎదురు దాడి చేసేందుకు ఆయుధ సంపత్తికి విరివిగా పెంచుకుంటుంది. దీనికోసం ఇజ్రాయెల్‌ నుంచి  స్పైక్‌ యాంటీ ట్యాంక్‌ సంబంధిత క్షిపణులు, హిరాన్‌ నిఘా డ్రోన్లు దిగుమతికి సిద్ధంగా ఉంది.  నౌక, వైమానిక దళం, సైన్యం నిఘా, లక్ష్యాల వివరాల కోసం ఇప్పటికే హిరాన్‌ మానవరహిత డ్రోన్లను వాడుతున్నవి. వైమానిక సేన నిఘా అవసరాలను తేర్చేందుకు ఇంకా హిరాన్‌ యూఏవీలు ఉండాలి. వీటిని కొనడానికి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశామని ప్రభుత్వం అధికారులు మీడియాకు వెల్లడించాయి. హీరాన్‌ డ్రోన్లు 10 కిలోమీటర్ల ఎత్తులో 48 గంటలు ఏకధాటిగా ఎగురుతూ సమాచారాన్ని సేకరించ గలవు.

బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో పదాతి దళం కోసం స్పైక్‌ యాంటి ట్యాంక్‌ క్షిపణులను గత సంవత్సరం భారత్‌ దిగుమతి చేసుకుంది. అపుడు 200 స్పైక్‌ మిస్సైల్స్‌,  12 లాంఛర్లు కొనుగోలు చేసింది. ఇపుడు శత్రువులను మట్టి కరిపించుటకు మరిన్ని ఆయుధాలు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. డీఆర్‌డీవో కూడా భద్రత అవసరాలను తీర్చడానికి మ్యాన్‌ ఫోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌  క్షిపణులను (ఎంపీ-ఏటీజీఎం)ను ఏర్పాటు చేస్తుంది.  ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా వాయుసేనకు యూఏవీలనూ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. 


logo