నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. తిండి లేకుండా రెండు మూడు రోజులు అయినా ఉండొచ్చు కానీ.. నిద్ర లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేం. మనిషికి నిద్ర అనేది అంత ముఖ్యం. మనిషి నిద్ర మీదనే అతడి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. నిద్ర తక్కువయినా.. నిద్రలేమి సమస్య ఉన్నా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనిషి హుషారుగా ఉండడు. యాక్టివ్‌గా పనిచేయలేడు.
నిజానికి రోజులో ఎంత సేపు నిద్రపోవాలి అనేదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతారు. కొందరు రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి అంటారు. ఇంకొందరు ఎంత సేపు నిద్రపోయాం అన్నది కాదు.. ఎంత ప్రశాంతంగా.. హాయిగా నిద్రపోయాం అనేది ముఖ్యం అంటారు.
తాజాగా యూఎస్‌కు చెందిన రీసెర్చర్స్ కూడా నిద్రకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఐసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. వాళ్లేమంటారంటే.. ఎంత సేపు నిద్రపోయాం అనేది కాదు.. ఎంత గాఢంగా నిద్రపోయాం అనేది ముఖ్యం అట. అంటే.. క్వాంటిటీ ఆఫ్ స్లీప్ కాదు.. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ముఖ్యం అన్నమాట.
చాలామంది న్యూరోలాజికల్కు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. దానికి కారణం నిద్రలేమీ అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. రోజూ గాఢనిద్రలోకి జారుకునే వాళ్లకు.. సైకలాజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారట. న్యూరోడీజనరేటివ్ కండిషన్స్ అస్సలు ఉండవట.
కొందరికి అస్సలు నిద్రపట్టదు.. కొందరికి పడుకోగానే నిద్రపడుతుంది. దీనిపై కూడా పరిశోధకులు ఏమంటున్నారంటే.. జన్యుశాస్త్రం ప్రకారం.. నిద్ర అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా పడుతుందట. ప్రతి ఒక్కరిలోనూ వారి జీన్స్ ఆధారంగా నిద్ర పడ్డే విషయంలోనూ తేడాలు ఉంటాయని ఈ స్టడీలో పాల్గొన్న న్యూరాలజిస్ట్ లూయిస్ పసెక్ తెలిపారు.
నిద్ర విషయంలో మెదడు కొన్ని స్లీప్ టాస్క్‌లను నిర్వహిస్తుంది. అలాగే స్లీప్ సైకిల్స్‌ను ఫాలో అవుతుంటుంది. ఒక మనిషి నిద్రపోవాలంటే.. మెదడు ఒకేసారి చాలా టాస్క్‌లను పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనిషికి నిద్రవస్తుంది. మనిషి నిద్ర నుంచి మేల్కోవాలన్నా కూడా మెదడులోని చాలా పార్ట్స్ ఒకేసారి పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. మెదడు అన్ని టాస్క్‌లను ఒకేసారి పర్ఫార్మ్ చేయలేనప్పుడు నిద్ర రావడం కష్టం.
బ్రెయిన్లోని కొన్ని పార్ట్స్ దెబ్బతిన్నా.. నిద్ర రావడం కష్టంగా మారుతుంది.. అలాగే క్వాలిటీ నిద్ర అనేది గగనం అవుతుంది. అప్పుడే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అంటే.. మెదడుకు అనారోగ్యం కలిగింది అంటే.. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా నిద్ర మీద పడుతుంది. అందుకే.. బ్రెయిన్ డిజాస్టర్స్కు సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే.. సరికొత్త ట్రీట్మెంట్ విధానాలను తీసుకొస్తే.. రాత్రి పూట నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండానే సహజంగా నిద్రపోవచ్చని జర్నల్‌లో స్పష్టం చేశారు.