మంగళవారం 11 ఆగస్టు 2020
Science-technology - Jul 13, 2020 , 20:39:21

4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 15 నిమిషాల్లో చార్జింగ్‌!

4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 15 నిమిషాల్లో చార్జింగ్‌!

ముంబై: ఇంతకుముందు బ్యాటరీలను చార్జ్‌ చేయాలంటే గంటల సమయం పట్టేది. కానీ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని వినియోగదారులకు తక్కువ సమయంలో చార్జ్‌ అయ్యే బ్యాటరీలను తయారుచేసి, మొబైల్‌లో వాడుతున్నాయి. ఇప్పటికే షియోమి, ఒప్పో, రియల్‌మీలు సూపర్‌ఫాస్ట్‌ చార్జింగ్‌ టీజర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీవో  గేమింగ్ బ్రాండ్ ఐక్యూ తన సొంత 120వాట్స్‌ సూపర్ ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీని అధికారికంగా ప్రకటించింది. ఇది 15 నిమిషాల్లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదని కంపెనీ తెలిపింది.  ఆగస్టు నాటికి ఈ సూపర్‌ ఫ్లాష్‌చార్జ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని సంకేతాలిచ్చింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రోలో కనిపించే ప్రస్తుత వేగవంతమైన 65వాట్స్‌ ఛార్జింగ్ సామర్థ్యాల కంటే ఇది రెండు రెట్లు వేగంగా ఉంటుంది. 

ఐక్యూ ఎగ్జిక్యూటివ్స్ ప్రకారం, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో 50% ‌చార్జ్‌ అవుతుంది. బ్యాటరీలోని సెల్స్‌ను ప్రత్యేక శ్రేణిలో అమర్చడం వల్ల ఇది సాధ్యపడింది. ఫోన్‌లోని ఇతర పరికరాలు దెబ్బతినకుండా ఉండాలంటే బ్యాటరీలో అదనపు గ్రాఫైట్‌ పొరలు, అదనపు అంతర్గత శీతలీకరణత అవసరం. అయితే, ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌తో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు.  కానీ కొత్త స్నాప్‌డ్రాగన్ 865/865 + చిప్‌సెట్‌తో కొత్త గేమింగ్-ఆధారిత పరికరాన్ని మార్కెట్‌లోకి తెస్తున్నట్లు సంకేతాలిచ్చింది. logo