ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఐక్యూ జెడ్3 5జీ( iQoo Z3 5G ) పేరుతో కొత్త ఫోన్‌ను జూన్ 8న భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత మార్చిలో చైనాలో ఆవిష్కరించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్‌తో భారత్‌లో రిలీజ్ కాబోతున్న మొట్టమొదటి ఫోన్ ఇదే. 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8జీబీ ర్యామ్‌తో వస్తున్నది. ఈ 5G ఫోన్ కేవలం 19 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ చేయగలదు.
ఐక్యూ జెడ్3 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.58 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 64+8+2 మెగా పిక్సెల్
ర్యామ్: 6జీబీ
స్టొరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4400mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11