శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Science-technology - Mar 26, 2020 , 20:18:19

భారీ డిస్‌ప్లేతో ఐఫోన్ 12

భారీ డిస్‌ప్లేతో ఐఫోన్ 12

సెప్టెంబ‌ర్‌లో ఐఫోన్ 12ను విడుద‌ల‌చేసేందుకు మొబైల్ దిగ్గ‌జ సంస్థ ఆపిల్  స‌న్నాహాలు చేస్తున్న‌ది. ఐఫోన్ 12 సిరీస్ ఫోన్‌ల‌కు సంబంధించి డిస్‌ప్లేతో పాటు డిజైన్‌లోనూ కంపెనీ చాలా మార్పుల‌ను చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 6.7 ఇంచ్‌ల భారీ డిస్‌ప్లేతో ఐఫోన్ 12ను తీర్చిదిద్ద‌నున్న‌ట్లు తెలిసింది. ట్రిపుల్ కెమెరా ఫీచ‌ర్‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. 5జీ నెట్‌వ‌ర్క్ టెక్నాల‌జీని స‌పోర్ట్ చేస్తాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి. నాచ్‌లెస్ డిస్‌ప్లేతో కొత్త మోడ‌ల్‌లో ఫోన్‌ను విడుద‌ల‌చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఐఫోన్ 12కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో జ‌రిగే వేడుక‌లో ఐఫోన్‌ 12తో పాటు ఐఫోన్ ఎస్ఈ-2, ఐఫోన్‌-9ను కూడా విడుద‌ల‌చేసేందుకు ఆపిల్ సంస్థ స‌న్నాహాలు చేస్తున్న‌ది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఈ ఈవెంట్ ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి


logo