e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Instagram Live : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచ‌ర్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే?

Instagram Live : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచ‌ర్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను షెడ్యూల్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే?

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా స‌రికొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను షెడ్యూల్ చేసుకునే ఆప్ష‌న్‌ను తీసుకొచ్చింది. మామూలుగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్టార్ట్ చేస్తే వెంట‌నే లైవ్ ఫాలోవ‌ర్స్‌కు వెళ్లిపోతుంది. కానీ.. షెడ్యూల్ ఆప్ష‌న్ ద్వారా టైమ్, డేట్ సెట్ చేసుకుంటే.. ఆ స‌మ‌యానికే వీడియో లైవ్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఆప్ష‌న్ వ‌ల్ల ఫాలోవ‌ర్స్ పెర‌గ‌డం, ఎంగేజ్‌మెంట్ పెర‌గ‌డం జరుగుతుంది. అందుకే.. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేయ‌డంతో పాటు లైవ్ వీడియోలు కూడా చేస్తుంటారు.

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను షెడ్యూల్ చేసేందుకు.. యాప్‌ను ఓపెన్ చేసి కెమెరాను ఓపెన్ చేసేందుకు లెఫ్ట్ నుంచి రైట్‌కు స్వైప్ చేయాలి. అప్పుడు స్టోరీ ఫార్మాట్ ఆప్ష‌న్ వ‌స్తుంది. వెంట‌నే రైట్ సైడ్ స్వైప్ చేసి లైవ్ ఆప్షన్‌ను ఓకే చేసి షెడ్యూల్ ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్క‌డ ఈవెంట్ పేరు సెట్ చేసుకొని లైవ్ ఎప్పుడు షెడ్యూల్ చేయాలో.. దాని డేట్‌, టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత దీన్ని ఒక ఇమేజ్‌లా యూజర్స్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యూజ‌ర్స్ ఆ పోస్ట్‌ను చూసి లైవ్ లింక్‌ను క్లిక్ చేసి లైవ్ డేట్‌ను సేవ్ చేసుకుంటారు.

- Advertisement -

దీనితో పాటు.. భ‌విష్య‌త్తులో యాప్‌కు సంబంధించిన ఏదైనా టెక్నిక‌ల్ స‌మ‌స్య ఉన్నా.. యాప్‌లోనే నోటిఫై చేసేలా ఇన్‌స్టాగ్రామ్ ఆప్ష‌న్‌ను తీసుకురానుంది. ప్ర‌స్తుతం ఆ ఫీచ‌ర్ టెస్టింగ్ ద‌శ‌లో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Samsung Galaxy A52S: స‌రికొత్త క‌ల‌ర్ వేరియంట్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్‌

OnePlus 9RT : హైఎండ్ ఫీచ‌ర్ల‌తో వ‌న్‌ప్ల‌స్ 9ఆర్‌టీ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే?

Motorola Moto E40 : బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో మోటరోలా మోటో ఈ40 ఫోన్ విడుద‌ల‌

Apple iPhone SE 3 : స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3.. ఐఫోన్ 13కు దీటుగా

Windows 11 : విండోస్‌ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement