మంగళవారం 07 జూలై 2020
Science-technology - Mar 25, 2020 , 22:48:09

హోమ్‌ క్వారంటైన్‌...ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

హోమ్‌ క్వారంటైన్‌...ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న తరుణంలో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు కూడా అవసరమైన ఫీచర్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాంగానే ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ప్రపంచంలో పలు దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నాయి. సోషల్‌ యాప్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ కూడా తమ యూజర్ల కోసం సామాజిక దూరం ప్రాధాన్యాన్ని తెలియజేసేలా ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. అదే ‘Co-Watching’ ఫీచర్‌.  హోమ్‌ క్వారెంటైన్‌లో ఉన్న  యూజర్లు తమ ఫ్రెండ్స్‌తో కమ్యూనికేషన్‌లో ఉండేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇన్‌ స్టాగ్రామ్‌ యూజర్లు ఒకవైపు తమ పోస్టులను స్క్రోల్‌ చేస్తూనే రిమోట్‌ మోడ్‌లో వీడియోలను వీక్షించవచ్చు. ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్లోని డైరెక్ట్‌ మెసేజ్‌ గ్రూపు చాట్‌ లోని పైన లెఫ్ట్‌ కార్నర్‌పై ఉన్న Video Icon క్లిక్‌ చేయవచ్చు లేదా కొత్త కాన్వర్జేషన్‌ క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు.. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీ ఫిల్టర్లను కూడా యాక్సస్‌ చేసుకునే వీలుంది. ఇన్‌ స్టాగ్రామ్‌లో ప్రధానంగా యూజర్లు స్క్రోల్‌ చేస్తూ తమ స్నేహితుల పోస్టులు, స్టోరీలు లేదా ఇన్‌ స్టాగ్రామ్‌ లైవ్‌ లను ఒకేసారి వీక్షించవచ్చు. అదేవిధంగా ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్లో కో-వాచ్‌ ఫీచర్‌ తోపాటు ‘స్టే ఎట్‌ హోమ్‌' స్టిక్కర్‌ ద్వారా ఈ స్టోరీలను పోస్టు చేయవచ్చు. మీ ఫాలోవర్లు, స్నేహితులను కరోనా నుంచి సురక్షితంగా ఉండేలా చూడొచ్చు.logo