మంగళవారం 02 మార్చి 2021
Science-technology - Jan 26, 2021 , 23:30:36

ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ స్టార్ట‌ప్‌లు భేష్‌!

ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ స్టార్ట‌ప్‌లు భేష్‌!

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి సంక్షోభం వెంటాడుతున్నా భార‌త్ స్టార్ట‌ప్‌లు పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో గ‌ణ‌నీయ పురోగ‌తి సాధించాయి. 2020లో 1200కి పైగా ఒప్పందాలు చేసుకున్న భార‌త స్టార్ట‌ప్‌లు 10.14 బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌గ‌లిగాయి. 2019లో ఆక‌ర్షించిన 14.5 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌తో పోలిస్తే 2020లో త‌క్కువైనా.. ఒప్పందాలు మాత్రం 20 శాతం ఎక్కువేన‌ని హెక్స్‌జీఎన్ అనే క‌న్స‌ల్టెంట్ సంస్థ నివేదించింది. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ సీడ్ స్టేజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒప్పందాలు 50 శాతం పెరిగాయి. 

2019లో 420 డీల్స్‌లో 353 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు వ‌స్తే, 2020లో 672కి పైగా డీల్స్‌తో 372 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఇది సానుకూల సంకేతం అని హెక్స్‌జీఎన్ వ్యాఖ్యానించింది. ఇన్వెస్ట‌ర్ కాన్ఫిడెన్స్, ఎంట‌ర్‌పెన్యూర్ క‌ల్చ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన ఇన్వెస్ట్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా అగ్నిల్ స‌హ‌కరించ‌డం వ‌ల్లే స్టార్ట‌ప్ సంస్థ‌లు ఈ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌గ‌లిగాయ‌ని తెలిపింది. అంత‌ర్జాతీయంగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించిన స్టార్ట‌ప్‌ల్లో వ‌రుస‌గా మూడో ఏడాది భార‌త్‌ది నాలుగో స్థానం. అగ్ర‌స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో బ్రిట‌న్ ఉన్నాయి. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టార్ట‌ప్ సంస్థ‌లు 308 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు సేక‌రించ‌గా, అమెరికా వాటా 165 బిలియ‌న్ల డాల‌ర్లు. దేశీయంగా బెంగ‌ళూరు, ఢిల్లీ ఎన్సీఆర్‌, ముంబైల్లోని స్టార్ట‌ప్ సంస్థ‌లే మొత్తం పెట్టుబ‌డుల్లో 90 శాతం సేక‌రించ‌గ‌లిగాయి. బెంగ‌ళూరు స్టార్ట‌ప్‌లు 4.3 బిలియ‌న్ డాల‌ర్లు, ఢిల్లీ ఎన్సీఆర్ మూడు బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు తెచ్చుకోగ‌లిగాయి. ఈ కామ‌ర్స్ రంగం అత్య‌ధికంగా మూడు బిలియ‌న్ల డాల‌ర్లు, ఫిన్‌టెక్ 2.37, ఎడ్‌టెక్ 1.52 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించాయి. జొమాటో 1.02 బిలియ‌న్ల డాల‌ర్లు, బైజూస్ 922 మిలియ‌న్లు, ఫోన్‌పే 807 మిలియ‌న్లు, ఉన్అకాడ‌మీ 260 మిలియ‌న్లు, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ 250 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు సేక‌రించాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo