ఆదివారం 24 జనవరి 2021
Science-technology - Nov 26, 2020 , 17:54:36

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌:‌..బంపర్‌ ఆఫర్లు

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌:‌..బంపర్‌ ఆఫర్లు

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలు దేశంలో   మరో ప్రత్యేక సేల్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ప్రతి ఏడాది నవంబర్‌ నెలలో  థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే బ్లాక్ ఫ్రైడే సేల్ కోసం పలు దేశాలు సన్నద్ధమవుతుండగా భారత వినియోగదారులను ఆకట్టుకునేందుకు  ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నవంబర్ 27 నుంచి 30 వరకు ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ   రియల్‌మీ కూడా   బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా  ప్రత్యేక ఆఫర్లు,  డిస్కౌంట్లను ప్రకటించింది.

బ్లాక్ ఫ్రైడే విక్రయాల్లో భాగంగా   షియోమీ, రియల్‌మీ, ఒప్పో, శామ్‌సంగ్,  ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన తగ్గింపులను ఇస్తోంది.   ఈ  సేల్‌ నవంబర్ 30 వరకు ఉంటుంది. ఎంఐ డాట్‌కామ్‌, అమెజాన్‌, రిటైల్‌ ఔట్‌లెట్లలో కూడా పలు ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉన్నాయి. 

రియల్‌మీ 6ఐ, రియల్‌మీ 6, రియల్‌మీ ఎక్స్‌3 సూపర్‌జూమ్‌, ఎక్స్‌50 ప్రొలతో పాటు AIoT ఉత్పత్తులైన రియల్‌మీ ఎయిర్‌బడ్స్‌ క్లాసిక్‌, రియల్‌మీ స్మార్ట్‌వాచ్‌, రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌ నియో, రియల్‌మీ క్యామ్‌ 360 డిగ్రీలపై భారీ తగ్గింపును ప్రకటించినట్లు రియల్‌మీ పేర్కొంది.  

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి స్పెషల్‌ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.  ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ డాట్‌కామ్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి   6నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.  గత  కొన్నేండ్లుగా నిర్వహిస్తున్న   బ్లాక్‌ఫ్రైడే  విక్రయాల్లో భాగంగా  ఆన్‌లైన్‌ , ఆఫ్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో   భారీ స్థాయిలో కొనుగోళ్లు నమోదవుతున్నాయి. logo