శనివారం 24 అక్టోబర్ 2020
Science-technology - Sep 30, 2020 , 11:49:18

బ్ర‌హ్మోస్ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం

బ్ర‌హ్మోస్ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం

భువ‌నేశ్వ‌ర్‌: భార‌త్ ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న రంగంలో శ‌ర‌వేగంగా దూసుకుపోతున్న‌ది. తాజాగా విస్తృత శ్రేణికి చెందిన బ్ర‌హ్మోస్ క్రూయిజ్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్ర‌యోగం నిర్వ‌హించారు. ఈ క్షిప‌ణి 400 కిలోమీట‌ర్ల దూరంలోని ల‌క్ష్యాల‌ను విజ‌య‌వంతంగా చేధించ‌గ‌ల సామర్థ్యం క‌లిగి ఉన్న‌ది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో) చేప‌ట్టిన పీజే-10 ప్రాజెక్టు కింద ఈ ప‌రీక్ష చేపట్టారు. దేశీయంగా రూపొందిందిన బూస్ట‌ర్‌తో ఈ బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని లాంచ్ చేశారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo