బుధవారం 05 ఆగస్టు 2020
Science-technology - Aug 01, 2020 , 20:32:10

శుక్రకణం గురించి అసలు నిజం ఇదేనా!

శుక్రకణం గురించి అసలు నిజం ఇదేనా!

మెక్సికో: శుక్ర కణాలను వీర్య కణాలని కూడా అంటారు. వీర్యం అనేది శక్తి, మలరహితం, పవిత్రమైంది. కాబట్టే దీనిని వీర్యం అంటారు. ఈ వీర్యం వలన ఓ కొత్త శరీరం పుడుతుంది. అందువల్లే దీనికి ఈ పేరు వచ్చింది. శుక్రకణాలు మూత్రనాళంలో తయారవుతాయి. ఇది ద్రవరూపంలో ఉంటుంది. ఈ ద్రవమే స్ఖలనం సమయంలో అంగం నుంచి బయట పడుతుంది. అయితే, శుక్రకణాలు తోకను కలిగి ఉంటాయని, ఇవి ఈ తోకను కదిలిస్తూ ఈల్స్‌లాగా ముందుకు కదులుతాయని ఇప్పటివరకూ మనకు తెలుసు. మూడు వందల ఏళ్ల క్రితం ఆంటోనీ వాన్‌ లీవాన్‌హుక్‌ అనే శాస్త్రవేత్త మొట్టమొదట సూక్ష్మదర్శిని ఉపయోగించి దీన్ని కనుగొన్నాడు. అయితే, ఇదంతా తప్పని తాజా అధ్యయనంలో తేలింది. 

3 డి టెక్నాలజీతో స్పెర్మ్‌ కదలిక క్యాప్చర్‌..


బ్రిస్టల్, మెక్సికో శాస్త్రవేత్తలు స్మెర్మ్‌ కదలికల గురించి కొత్త ప్రతిపాదన చేసి,  విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన అభిప్రాయాన్ని బద్దలు కొట్టడం ద్వారా సంతానోత్పత్తి శాస్త్రంలో పురోగతి సాధించారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ 3-డీ మైక్రోస్కోపీ, గణిత సూత్రాలను ఉపయోగించి ఈ శాస్త్రవేత్తలు 3-డిలో శుక్రకణం తోక నిజమైన కదలిక పునర్నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.  దీనికోసం వారు సెకన్‌లో 55,000 ఫ్రేమ్‌లను రికార్డు చేసేందుకు హై స్పీడ్‌ కెమెరాను ఉపయోగించారు. పిజోఎలెక్ట్రిక్ పరికరంతో సూక్ష్మదర్శిని నమూనాను నమ్మశక్యం కాని అధిక రేటుతో పైకి, కిందికి తరలిస్తూ స్పెర్మ్‌ స్విమ్మింగ్‌ను 3-డిలో స్వేచ్ఛగా స్కాన్‌ చేయగలిగారు. 

కార్క్‌స్క్రూయింగ్‌లా ముందుకు..


వారి అధ్యయనం ప్రకారం.. శుక్రకణం అనేది ముందుకు అతి తెలివిగా కదులుతున్నదని గుర్తించారు. వంకీలు తిరుగుతూ పక్క నుంచి పక్కకు మారుతూ వృత్తాకారంలో ముందుకు కదులుతుందని గుర్తించారు. స్పెర్మ్‌ ఈతకొడుతున్నప్పుడు కార్క్‌స్క్రూయింగ్‌ (స్క్రూ వృత్తాకారంగా తిరుగుకుంటూ రంధ్రంలోకి ఎలా కదులుతుందో అలా)లాగా ముందుకు కదులుతున్నదని తేల్చారు. అయితే, ఇది 2-డి మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు లీవెన్‌ హుక్‌ చెప్పిన మాదిరిగా తోకను ఊపుకుంటూ ఈల్స్‌ లాగా ముందుకు కదుతున్నట్లే కనిపిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ హెర్మస్‌ గడేలా పేర్కొన్నారు. తమ అధ్యయనం ప్రకారం.. స్పెర్మ్‌ కదలిక అత్యంత క్లిష్టంగా ఉంటుందని వివరించారు. శుక్రకణం తల, దాని తోక ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుందన్నారు. దీనిని భౌతికశాస్త్రంలో ప్రెసిషన్‌ అంటారని తెలిపారు. ఇది అచ్చం సూర్యునిచుట్టూ భూమి, అంగారకుడు తిరిగేటప్పుడు కనిపించే కక్షల మాదిరిగా ఉంటుందని వివరించారు. తమ అధ్యయనం మానవ పునరుత్పత్తి రహస్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే, ఈ ఆవిష్కరణ స్పెర్మ్‌ చలనశీలత, సహజ ఫలదీకరణంపై దాని ప్రభావానికి సంబంధించి విప్లవాత్మక అవగాహనను పెంపొందిస్తుందని  యూనివర్సిడాడ్ నేషనల్ ఆటోనోమా డి మెక్సికోకు చెందిన డాక్టర్ అల్బెర్టో డార్జోన్ పేర్కొన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo