గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Mar 01, 2020 , 16:49:44

హెచ్‌టీసీ నుంచి వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70 స్మార్ట్‌ఫోన్‌

హెచ్‌టీసీ నుంచి వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70 స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70 ని భారత్‌లో త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.  ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. 

హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.53 ఇంచుల డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, 2.5 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి23 ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 16, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.2, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందివ్వనున్నారు. 


logo
>>>>>>