ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Science-technology - Jul 26, 2020 , 17:29:53

మాస్క్‌ ఎందుకు ధరించాలో.. ఈ అధ్యయనం చెబుతుంది!

మాస్క్‌ ఎందుకు ధరించాలో.. ఈ అధ్యయనం చెబుతుంది!

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం తప్ప వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేం. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో మాస్క్‌లు మంచి ఫలితాలిస్తున్నాయనడానికి ఓ అధ్యయనం మరింత బలాన్ని ఇస్తుంది. అమెరికా మిస్సోరి స్ప్రింగ్‌ ఫీల్డ్‌లోని ఓ సెలూన్‌లో పని చేసే ఇద్దరు స్పెషలిస్టులకు మే మధ్యలో కరోనా లక్షణాలు గుర్తించారు. అయినా వారు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు సెలూన్‌లో 139 మంది వరకు సేవలందించారు. ఈ క్రమంలో వినియోగదారులు కొవిడ్‌ బారిన పడకుండా మాస్క్‌ ధరించడంతో వైరస్‌ను దూరంగా ఉంచగలిగింది. రెండు వారాల అనంతరం సెలూన్‌లో సేవలు పొందిన వారి గురించి ఆరా తీయగా వారిలో కొవిడ్‌-19 లక్షణాలు ఏవీ అభివృద్ధి చెందలేదు.

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేసిన నెల తర్వాత 139 మంది క్లయింట్లలో 104 మందిని టెలీఫోన ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో 102 మందిలో (98.1శాతం) సెలూన్‌లో ఉన్నప్పుడు మాస్క్‌ ధరించినట్లు చెప్పగా, మరో ఇద్దరు మాస్క్‌ పెట్టుకోలేదని తెలిపారు. అలాగే సెలూన్‌ నిపుణులు వినియోగదారులకు సేవలందిస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించారు. డబుల్‌ లేయర్‌ కాటన్‌ లేదా సర్జికల్‌ మాస్క్‌లను పెట్టుకున్నారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ప్రారంభానికి ఐదు రోజుల ముందుకు బహిర్గతం చేసిన వారికి పరీక్షలు చేశారు. ఇందులో 67 (48.2) క్లయింట్లు స్వచ్ఛందంగా పరీక్షించబడ్డారు. అలాగే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసినా కరోనా సోకలేదని తెలింది. ఈ అధ్యయన ఫలితాలు మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీ రిపోర్ట్‌లో ప్రచురించబడ్డాయి.   

క్లయింట్లకు దగ్గరగా..

హెయిర్‌ స్టైలిస్టులు తమ ఖాతదారులకు 15 నుంచి 45 నిమిషాల వరకు దగ్గరగా ఉండి పని చేశారు. హెయిర్‌ కటింగ్‌, ఫేషియల్‌ తదితర సేవలు చేసేందుకు సన్నిహితంగా మెదిలారు. అయినప్పటికీ వారికి వైరస్ వ్యాప్తి చెందలేదు. వైరస్‌ సోకేందుకు దగ్గరగా ఉన్నా, తక్కువ సమయం సరిపోతుంది. ఎక్కువగా మాట్లాడడం, తుమ్మడం, దగ్గడం ఏమీలేదు. అలాగే హేయిర్‌ కట్‌ చేయించుకున్న వారు చాలా మంది వారితో కొంత దూరంగా ఉన్నారు. ఇది కూడా కొంత వైరస్‌ వ్యాప్తిని కొంత తగ్గించి ఉండవచ్చు. 

మాస్క్‌లు ఎందుకు ధరించాలంటే?

వైరస్ సోకే ‘లక్షణాలు రెండు, మూడు రోజుల్లోనే అత్యధికం’ అనేందుకు ఆధారాలు ఉన్నాయి. లక్షణాలు కనిపించే ముందు వైరస్‌ వ్యాప్తి రేటు స్పష్టంగా లేదు. అయినా లక్షణాలు లేవని వ్యక్తులు ‘వైరస్‌ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం ఉంది’. అయినా హెయిర్‌ స్టైయిలిస్ట్‌లు లక్షణాలు గుర్తించే రెండు రోజుల ముందు సంభాషించిన ఖాతాదారులను ఈ అధ్యయనంలో గుర్తించలేదు. అలాగే పరీక్షించలేదు. ఇద్దరు స్టైలిస్టుల్లో ఒకరు మాస్క్‌ ధరించనప్పుడు ఖాతాదారుల్లో ఒకరి నుంచి మిగతా వారికి సోకింది. అలాగే, స్టైలిస్టుల్లో ఒకరు ఆమెతో నివసిస్తున్న మరో నలుగురికి సోకింది. వ్యాధి సోకిన మొదటి స్టైలిస్ట్ లక్షణాలు కనిపించిన కూడా.. ఎనిమిది రోజుల పాటు సెలూన్‌లో పని చేసింది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినప్పుడే ఆమె పని చేయడం మానేసింది. మూడు రోజుల తర్వాత రెండో వ్యక్తికి శ్వాసకోశ లక్షణాలు కనిపించగా, పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌ ఫలితాలకు ముందు ఐదు రోజులు సెలూన్‌లో పని చేశాడు. ఈ ఫలితాలు ప్రజలు ఇతర ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించేందుకు మద్దతు ఇవ్వనున్నాయి. ‘ప్రత్యేకించి సామాజిక దూరం సాధ్యం కానప్పుడు, SARS-CoV-2 వ్యాప్తిని తగ్గించడానికి’. 

ప్రత్యామ్నాయం కాదు..

ఆరోగ్యకరమైన, సోకిన వ్యక్తుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, ‘మాస్క్‌ల వాడకం కొవిడ్‌-19 వ్యాప్తిని పరిమితం చేయగల నివారణ, నియంత్రణ చర్యల్లో ఓ భాగం. ఏదేమైనా మాస్క్‌ వాడకం తగినంత స్థాయిలో రక్షణ లేదా నియంత్రణకు సరిపోదు. శ్వాసకోశ వైరస్‌ల ప్రసారాన్ని అణచివేసేందుకు వ్యక్తిగత, సమాజ స్థాయి చర్యలు కూడా తీసుకోవాలి. (మాస్క్‌లు) ఇతర ప్రజారోగ్య చర్యలకు ప్రత్యామ్నాయం కాదు. చేతులు శుభ్రంగా ఉండడం, ఫిజికల్‌ డిస్టెన్సింగ్, పరీక్ష, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలైనవన్నీ చేయాలని అని డబ్ల్యూహెచ్‌ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ ట్వీట్‌ చేశారు. యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఈసీడీసీ) సైతం ఇదే విషయాన్ని చెప్పింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo