ప్రస్తుతం యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ పరిచయమే. అప్పుడప్పుడు టైమ్ పాస్ కోసమో.. లేక ఏదైనా సమాచారం కోసమో.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటాం. అయితే.. ఒక్కోసారి యూట్యూబ్‌లో ప్లే అయ్యే వీడియో క్వాలిటీ అస్సలు బాగుండదు. టెక్నాలజీ రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ జనరేషన్లో వీడియోల క్వాలిటీ కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. 4కే రిజల్యూషన్‌తో కూడా ప్రస్తుతం వీడియోలను షూట్ చేస్తున్నారు. హెచ్డీ కంటే కూడా 4కేలో వీడియో క్లారిటీ ఇంకా మెరుగ్గా ఉంటుంది. 4కే రిజల్యూషన్‌తో వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినా.. యూజర్ ఆ వీడియోను ఓపెన్ చేస్తే మాత్రం ఆటో వీడియో క్వాలిటీలో ప్లే అవుతుంది. దీంతో వీడియో క్వాలిటీ అంత బాగుండదు.
కొందరు యూజర్లు మాత్రం వీడియో ఓపెన్ చేశాక.. వీడియో కింద సెట్టింగ్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. క్వాలిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో క్వాలిటీని సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా.. వీడియో క్వాలిటీని ఆటోగా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. యూట్యూబ్ ను యూజర్ ఓపెన్ చేసినప్పుడు నెట్ స్పీడ్‌ను అంచనా వేసి.. వీడియో క్వాలిటీని రెకమండ్ చేస్తుంది.
144 పిక్సెల్ అనేది అత్యంత తక్కువ వీడియో క్వాలిటీ.. 240పీ, 360పీ, 480పీ, 720పీ, 1080హెచ్డీ, 1440హెచ్డీ, 2160 4కే రిజల్యూషన్‌లో వీడియోలను చూడొచ్చు. కాకపోతే.. ఎక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియోలను చూడాలంటే.. నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి. డేటా కూడా సరిపోయేంత ఉండాలి.
అలా కాకుండా ముందే.. వీడియో క్వాలిటీని కూడా సెట్ చేసుకోవచ్చు. యూజర్ నెట్ స్పీడ్‌ను బట్టి.. తన వీడియో క్వాలిటీని సెట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోలను మొబైల్లో చూసేవాళ్లు అయితే.. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి అకౌంట్ డిస్ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి వీడియో క్వాలిటీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే.. ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూసినా.. ముందు సెలెక్ట్ చేసుకున్న వీడియో క్వాలిటీ ఆప్షన్లోనే ప్లే అవుతుంది.
ఒకవేళ యూట్యూబ్‌ను పీసీలో కానీ.. లాప్ టాప్‌లో కానీ ఓపెన్ చేసినప్పుడు.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఆటో క్వాలిటీ ఫర్ యూట్యూబ్ అనే ఫైల్ ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌కు యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసి పిన్ చేసుకుంటే.. అది విండోలో కనిపిస్తుంది. అప్పుడు బ్రౌజర్లో యూట్యూబ్‌ను ఓపెన్ చేసి.. ఎక్స్టెన్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే.. ఒక డ్రాప్ డౌన్ మెను కనిపిస్తుంది. అక్కడ కావాల్సిన వీడియో క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లు అయితే యూట్యూబ్ హై డెఫినిషన్ ఎక్స్‌టెన్షన్‌ను యాడ్ చేసుకోవాలి. యూట్యూబ్‌ను ఓపెన్ చేసి.. ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి కావాల్సిన వీడియో క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు.