గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Mar 07, 2020 , 16:51:36

కరోనా వైరస్‌.. ఫోన్లను ఇలా శానిటైజ్‌ చేసుకోండి..!

కరోనా వైరస్‌.. ఫోన్లను ఇలా శానిటైజ్‌ చేసుకోండి..!

నిత్యం మనం వాడే స్మార్ట్‌ఫోన్లపై ఎంతటి బాక్టీరియా, వైరస్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫోన్లను శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఫోన్లపై ఒకవేళ కరోనా వైరస్‌ ఉంటే అది చాలా సులభంగా మనకు వ్యాపిస్తుందని వారు చెబుతున్నారు. మరి కరోనా వైరస్‌ బారి నుంచి ఫోన్లను ఎలా శానిటైజ్‌ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..! 

స్టెప్‌: 1: ఒక మగ్‌లో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా హ్యాండ్‌ వాష్‌ ద్రావణం లేదా సబ్బు వేయాలి. నీటిలో ఆ ద్రావణం లేదా సబ్బును కలిపి బాగా మిక్స్‌ చేయాలి. 

స్టెప్‌: 2: శానిటైజ్‌ చేయాల్సిన ఫోన్‌ను స్విచాఫ్‌ చేయాలి. కేబుల్స్‌, ఇయర్‌ఫోన్స్‌ ఏవైనా పెట్టి  ఉంటే తీసేయాలి. 

స్టెప్‌ 3: ఒక శుభ్రమైన వస్ర్తాన్ని తీసుకుని ముందుగా ప్రిపేర్‌ చేసుకున్న ద్రావణంలో దాన్ని ముంచి నీటిని బాగా పిండాలి. నీరు పూర్తిగా వస్త్రం నుంచి పోయేలా చూసుకోవాలి. 

స్టెప్‌: 4: లైట్‌గా తడి ఉండేట్లు వస్త్రం నుంచి నీటిని పిండాక ఆ వస్త్రంతో ఫోన్‌ను తుడవాలి. 

స్టెప్‌: 5: వెంటనే పొడిగుడ్డతో ఫోన్‌ మళ్లీ తుడవాలి. దీంతో ఫోన్‌ శానిటైజ్‌ అవుతుంది. దానిపై ఉండే బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. 

పైన చెప్పిన విధానంతో వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ ఉన్న ఫోన్లను మరింత సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. 


logo