సోమవారం 25 మే 2020
Science-technology - Mar 31, 2020 , 18:49:07

వైఫై స్పీడ్ తగ్గటానికి కారాణాలేంటి?

వైఫై స్పీడ్ తగ్గటానికి కారాణాలేంటి?

లాక్‌ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఈనేపథ్యంలో వైఫై ఎక్కువగా వాడుతున్నారు. వైఫై స్లోగా రావడం ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యే. వైఫై స్పీడ్ పెంచుకోవడానికి ఈ చిట్కాలు.

- ముందుగా వైఫై అవసరం లేని డివైజ్ లు ఏమైనా ఉంటే రౌటర్ నుంచి డిస్ కనెక్ట్ చేయాలి. 

- రౌటర్ ఎలక్ట్రికల్ పరికరాలకు, గోడలకు దూరంగా ఉంచాలి. రౌటర్ చుట్టూ స్పేస్ ఉండేలా చూసుకోవాలి.

- రౌటర్ కు మధ్య 10 అడుగుల దూరం ఉంటే 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఎంచుకోవాలి. దీనివల్ల సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటుంది.

- మార్కెట్లో వైఫై సిగ్నల్ ను పెంచే బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాడడం ద్వారానూ వైఫై సిగ్నల్ పెంచుకోవచ్చు.

- వైఫై డెడ్ జోన్స్ తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించవచ్చు. ప్రతీ రౌటర్ కు లిమిటేషన్ ఉంటుంది. ఎన్ని యాంటీనలున్నా డెడ్ జోన్స్ ఉంటాయి.


logo