ఇవాళ 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఈసందర్భంగా భారతీయులు అందరూ ఘనంగా స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్నారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడన వీరులను స్మరించుకుంటున్నారు.
ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను పలువురు పంచుకుంటున్నారు. వాట్సప్‌ను కూడా ఉపయోగించి.. ఇండిపెండెన్స్ డే విషెస్ చెబుతున్నారు. ఈనేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవానికే సంబంధించిన కస్టమ్ స్టిక్కర్స్‌ను, ఫ్రేమ్స్‌ను వాట్సప్ ద్వారా ఇతరులకు పంపించవచ్చు. అయితే.. ఈ స్టిక్కర్లు.. వాట్సప్ అందిస్తున్న నేటివ్ స్టిక్కర్లు కావు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. అక్కడి నుంచి వాట్సప్ ద్వారా స్టిక్కర్లను వాట్సప్ కాంటాక్ట్స్‌కు షేర్ చేయొచ్చు.
ఈ థర్డ్ పార్టీ యాప్స్ కూడా కేవలం గూగుల్ ప్లే స్టోర్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ యూజర్లకు యాపిల్ స్టోర్‌లో ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో లేవు. ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవాళ్లు మాత్రం గూగుల్ ప్లే స్టోర్‌లో ఇండిపెండెన్స్‌డేకు సంబంధించిన పలు స్టిక్కర్స్ ఉండే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని.. వాట్సప్‌లో షేర్ చేసుకోవచ్చు.