e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News డ‌బుల్ మాస్క్ ఎందుకు వాడాలి..?

డ‌బుల్ మాస్క్ ఎందుకు వాడాలి..?

డ‌బుల్ మాస్క్ ఎందుకు వాడాలి..?

కొవిడ్-19 కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మాస్క్‌లు ధ‌రించ‌డం, నిర్ణీత భౌతిక దూరం పాటించ‌డం, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవ‌డం చాలా ప్ర‌భావం చూపుతున్నాయి. అయితే, ఒక మాస్క్ ధ‌రించ‌డం క‌న్నా డ‌బుల్ మాస్క్ ధ‌రించ‌డం చాలా ఉత్త‌మ‌మ‌ని వైద్య‌నిపుణులు సెల‌విస్తున్నారు. ఈ విష‌యాల‌ను అమెరికా సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) అధ్య‌య‌నంలో కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి.

క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతుండ‌టంతో రెండు మాస్కుల వాడ‌కాన్ని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు, దీనిని “డబుల్ మాస్కింగ్” అని పిలుస్తారు. ఇది ప్రాణాంతక వ్యాధికి వ్యతిరేకంగా బలమైన అవరోధాన్ని సృష్టించగలదని వారు అంటున్నారు. డబుల్ మాస్కింగ్.. వస్త్రం, స‌ర్జిక‌ల్ మాస్క్‌ల‌తో గాలి లీకేజీని నివారించవచ్చు. అలాగే, ముఖం ఆకృతులను డ‌బుల్ మాస్క్‌లు బాగా సరిపోతాయి.

డబుల్ మాస్కింగ్ కొవిడ్-19 కు గురికావడాన్ని దాదాపు 95 శాతం తగ్గించినట్లు యూఎస్ సీడీసీ తెలిపింది.

  • ముఖం ఆకృతుల‌కు డ‌బుల్ మాస్కులు స‌రిపోతాయి.
  • గాలి లీకేజీల‌ను అరిక‌డ‌తాయి.
  • చెవి చుట్టూ మెలేసి పెట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల స‌ర్జిక‌ల్ మాస్కుల ద్వారా 56.1 శాతం, మామూలు వ‌స్త్రంతో తయారైన మాస్కుల ద్వారా 51.4 శాతం మాత్ర‌మే వైర‌స్‌ను అడ్డుకుంటాయి.
  • చెవి చుట్టూ మెలేసి గ‌ట్టిగా పెట్టుకోవ‌డం ద్వారా గాలి లీకేజీని అరిక‌ట్ట‌డం వ‌ల్ల 77 శాతం వైర‌స్‌ను అడ్డుకోవ‌చ్చు.
  • స‌ర్జిక‌ల్ మాస్క్‌, సాధార‌ణ మాస్క్ రెండింటిని క‌లిపి ధ‌రించ‌డం ద్వారా ఏకంగా 85.4 శాతం వైర‌స్‌ను అడ్డుకునే వీలుంటుంది.

చేయాల్సిన‌వి… చేయ‌కూడ‌నివి..

బ‌య‌ట‌కు వెళ్లేప్పుడు ముఖానికి మాస్క్ స‌రిగా అమ‌రింది లేనిదీ చూసుకోవాలి.

శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా పరిశీలించాలి.

మాట్లాడే మాట ఎదుటి వారికి స్ప‌ష్టంగా వినిపిస్తుందా చెక్‌ చేసుకోవాలి.

ఒకేసారి రెండు స‌ర్జిక‌ల్ మాస్కులు వాడ‌కూడ‌దు.

ఎన్ 95 మాస్కును సాధార‌ణ మాస్క్‌తో క‌లిపి వాడొద్దు.

మాస్కుల‌పై ఇన్‌పెక్ష‌న్ సోక‌కుండా వాడే ద్రావ‌ణాని చ‌ల్ల‌కూడ‌దు.

చినిగిపోయిన మాస్కుల‌ను అస్సలు వాడ‌కూడ‌దు.

ఇవి కూడా చదవండి..

కొవిడ్ సెకండ్‌ వేవ్ భిన్నం.. వ‌చ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?

ఇద్ద‌రు గూండాల‌కు ప‌శ్చిమ బెంగాల్‌ను వ‌ద‌ల‌ను : మ‌మ‌తా బెన‌ర్జీ

అమెరికా దౌత్య‌వేత్త‌ల‌కు ర‌ష్యా దేశ‌ బ‌హిష్కరణ

సౌదీ ఎయిర్‌బేస్‌పై దాడి మా ప‌నే: హైతీ తిరుగుబాటుదారులు

అంగారకుడిపై నాసా ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి

మొక్క‌ల పెంప‌కంపై గూగుల్ డూడుల్

పాకిస్తాన్‌లో శాంతిని భార‌త్ కోరుకోవ‌డం లేదు : పాక్ మంత్రి షేక్ ర‌షీద్‌

ర‌ష్యా తురుపుముక్క లెనిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
డ‌బుల్ మాస్క్ ఎందుకు వాడాలి..?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement