శనివారం 04 జూలై 2020
Science-technology - May 29, 2020 , 19:24:54

ఫైల్‌ సైజ్‌ తగ్గించడం ఎలా?.. టెక్‌ టిప్స్‌

ఫైల్‌ సైజ్‌ తగ్గించడం ఎలా?.. టెక్‌ టిప్స్‌

చాలా సంద‌ర్భాల్లో పెద్ద సైజ్ ఉన్న ఫొటోలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్‌లు,  వీడియోలు మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా వాటిని ఇత‌రుల‌కు పంపాలంటే  త‌ల‌నొప్పిగానే ఉంటుంది. ఎక్కువ టైం, ఎక్కువ డాటాను తింటుంది. ఒక్కోసారి మోతాదుకు మించి సైజ్ ఉన్న వాటిని అప్‌లోడ్  కూడా చేయ‌లేం. ఇలాంటి సందర్భాల్లోనే ఫైల్స్‌ను చిన్న‌సైజుల్లోకి మార్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎలా అంటారా? ఇదిగో..  ఫైల్ కంప్రెషివ్ యాప్స్‌. ఓసారి చూడండి.

పీడీఎఫ్ ఫైల్స్‌: 

ఇప్పుడు వాట్సాప్‌లోనూ పీడీఎఫ్ ఫైల్స్ పంపుకోవ‌డం సాధార‌ణం అయింది. అయితే ఫైల్‌ సైజు ఓ మోతాదుకు మించి ఉండకూడదు. వంద ఎంబీల పీడీఎఫ్‌నే అండ్రాయిడ్ వాట్సాప్ ద్వారా పంపొచ్చు. కానీ అంత‌క‌న్నాఎక్క‌వ ఉంటే స‌మ‌స్యే. అలాంట‌ప్పుడు ఆ ఫైల్‌ను కంప్రెస్ చేయాలి. www.ilovepdf.com మంచి మార్గం. దీని ద్వారా ఫైల్ సైజ్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. 70శాతం సైజ్ నాణ్య‌త‌కు ఇబ్బంది లేకుండా త‌గ్గుతుంది.

ఇత‌ర ఫైల్స్ కోసం : B1 Archiver : ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్లో ఉచితంగా లభిస్తున్నది. మనం ఇతరులకు పంపాలనుకునే ఫైల్స్‌ను 37 ఫార్మాట్లలో పంపే విధంగా మార్చుకోవడంతో పాటు సైజులోనూ మార్పులు చేసుకోవచ్చు.

RAR : ఉత్తమ ఆండ్రాయిడ్‌ ఫైల్‌ కంప్రెస్‌ యాప్‌లో ఇదొకటి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోసం ఫైల్స్‌కు పాస్వర్డ్‌ పెట్టుకునే ఫీచర్‌ కూడా ఉంటుంది.

Z Archiver : పైళ్లను మీకు నచ్చిన సైజులో పంపేందుకు ఇదొక మంచి యాప్‌. దీని ద్వారా ఫైల్‌ను జిప్‌, పీడీఎఫ్‌, jPEG ఫార్మాట్లలో పంపవచ్చు. సైజు ఎంత కావాలనుకున్నారో కూడా సెట్‌ చేసుకోవచ్చు.

XZip, Winzip, 7Zipper వంటి యాప్‌లు కూడా ఫైల్‌ కంప్రెస్‌ కోసం ఉపయోగపడే ఉత్తమ యాప్స్‌.


logo