మంగళవారం 01 డిసెంబర్ 2020
Science-technology - Sep 10, 2020 , 20:05:03

వ్యక్తిగత డేటా భద్రతే ఆండ్రాయిడ్‌ 11 ప్రథమ లక్ష్యం

వ్యక్తిగత డేటా భద్రతే   ఆండ్రాయిడ్‌ 11 ప్రథమ లక్ష్యం

న్యూఢిల్లీ:ప్రతిఏడాది తన సాఫ్ట్‌వేర్‌  ఆండ్రాయిడ్‌కు   అప్‌డేట్‌ను    తీసుకొచ్చే గూగుల్ ఈసారి ఆండ్రాయిడ్ 11 పేరిట మరో   అప్‌డేట్‌తో వస్తోంది.  ప్రస్తుతం  వినియోగంలో ఉన్న,   భవిష్యత్తులో  విడుదలకానున్న  స్మార్ట్‌ఫోన్లను   దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్   సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నది.  ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో వ్యక్తిగత డేటా భద్రత గురించి సర్వత్రా  చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే   వ్యక్తిగత సమాచారం భద్రతే లక్ష్యంగా ఆండ్రాయిడ్‌ 11ను తీసుకొస్తున్నది.   ఓఎస్‌ 11లో  గూగుల్‌ కొత్త వర్క్‌ ప్రొఫైల్‌ను అందిస్తోంది. 

'ఉద్యోగులకు వారి లొకేషన్‌ ప్రైవసీ గురించి మరింత సమాచారం ఇవ్వడానికి,  ఎప్పుడైనా వారి ఐటీ అడ్మిన్‌ యాప్‌లు పనిచేయడానికి  లొకేషన్‌ యాక్సెస్‌ ఇచ్చినప్పుడు మేం కొత్త నోటిఫికేషన్‌ను జోడిస్తామని' గూగుల్‌ మంగళవారం బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది.