బుధవారం 30 సెప్టెంబర్ 2020
Science-technology - Sep 14, 2020 , 18:29:22

భూమిపై నీరెలా వచ్చింది..?

భూమిపై నీరెలా వచ్చింది..?

హైదరాబాద్‌: ప్రాథమిక పాఠశాలల నుంచి సైన్స్ డాక్యుమెంటరీల వరకు భూమిని ‘నీలి గ్రహం’ అని పిలుస్తారు.  దాని ఉపరితలంపై 71% నీరు ఉండడం వల్లే ఈ పేరు వచ్చింది. అయితే, ఈ నీరంతా భూమిపైకి ఎలా వచ్చింది.  చాలా గ్రహాలపై అసలు ప్రాణులే లేవు.. కానీ ఒక్క భూమిపైనే నీరెందుకుంది?. దీనికి ఖచ్చితమైన సమాధానాలు తెలుసకునేందుకు ఆస్ట్రోబయాలజీ, ప్లానెటరీ సైన్స్ రంగాలు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ చిక్కుముడి వీడితే జీవం మూలం గురించి తెలుసుకునేందుకు మార్గం సులభమవుతుంది. అయితే, భూమిపై నీరెలా వచ్చిందో తెలుసుకునేందుకు పలువురు శాస్త్రవేత్తలు అంతరిక్షం వైపు చూస్తున్నారు. 

జీవం పుట్టుక నుంచి భూమిపై చాలా మార్పులు వచ్చాయి. అయితే, ఉల్కలు వంటి కొన్ని అదనపు గ్రహ వస్తువులు మాత్రం మార్పునకు లోనుకాలేదు. అలాంటి ఒక ఉల్క సహారా 97096 ఎన్‌స్టాటైట్ కొండ్రైట్ (ఈసీ).  ఈసీ ఉల్కల కుటుంబం భూమి స్వంత కూర్పు. కాగా, సహారా 97096పై సెంటర్ డి రీచెర్స్ పెట్రోగ్రాఫిక్స్, జియోచిమిక్స్ ఇన్ నాన్సీ (సీఎన్ఆర్ఎస్ / యూనివర్సిటీ డి లోరైన్) నిర్వహించిన తాజా అధ్యయనం భూమిపై మొదటి నుంచీ నీరు ఉందని తేల్చింది. ఈ అధ్యయన ఫలితాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

భూమిపైనున్న ఆదిమ శిలలలో ప్రస్తుత పరిమాణంలో మూడు రెట్లు మహాసముద్రాలను నింపేందుకు తగినంత నీరు ఉందని తేలింది. 1997 లో కనుగొన్న ఉల్కను పరిశీలించి ఆదిమ భూ శిలలు గతంలో నమ్మినంత పొడిగా లేవని నిర్ధారించారు. మొదటి భూమి ఏర్పడిందని, చాలాకాలం తర్వాత నీరు వచ్చి చేరిందని అంచనావేశారు. నీటితో కూడిన గ్రహశకలాలు భూమిని ఢీకొట్టినప్పుడు శిలలోని నీరు సముద్రాల్లోకి చేరిందని కనుగొన్నారు. అయితే,  5% నీరు మాత్రమే గ్రహశకలాల నుంచి వచ్చి ఉండవచ్చని, మిగిలిన 95% భూమి స్వంత కూర్పులో భాగమని తేల్చారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo