గురువారం 13 ఆగస్టు 2020
Science-technology - Jul 31, 2020 , 17:54:24

హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15 వచ్చేసింది..రూ.3వేల డిస్కౌంట్‌

హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15 వచ్చేసింది..రూ.3వేల డిస్కౌంట్‌

న్యూఢిల్లీ:   చైనా కంపెనీ  హువావే సబ్ బ్రాండ్  హానర్  మొట్టమొదటి  ల్యాప్‌టాప్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది.  హానర్‌ మ్యాజిక్‌బుక్‌ 15(8జీబీ ర్యామ్‌ +256జీబీ SSD)  పేరుతో శుక్రవారం  15.6 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్‌ప్లే కలిగిన ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది.  పాప్‌ అప్‌ వెబ్‌క్యామ్‌, 2 ఇన్‌ 1 ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ పవర్‌ బటన్‌, 65 W ఫాస్ట్‌ ఛార్జర్‌,  ఏఎండీ రైజెన్‌  3000 సిరీస్‌ సీపీయూ, వెగా గ్రాఫిక్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.  విండీస్‌ ప్రీ-ఇన్‌స్టాల్‌తో వస్తున్నది.   

మిస్టిక్‌ సిల్వర్‌ కలర్‌ వేరియంట్‌లో ఉన్న మ్యాజిక్‌బుక్‌ విక్రయాలు ఆగస్టు  6న మధ్యాహ్నం 12 గంటల  నుంచి ప్రారంభంకానున్నాయి.    ఫస్ట్‌సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌పై డిస్కౌంట్‌ ఉంటుందని కంపెనీ పేర్కొంది.   భారత్‌లో మ్యాజిక్‌బుక్‌ 15 ధర రూ.42,990గా ఉంది.  ఫస్ట్‌సేల్‌ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ.3000   డిస్కౌంట్‌ ఇస్తుండటంతో  రూ. 39,990కే ల్యాప్‌టాప్‌ను వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు.  logo