మంగళవారం 02 జూన్ 2020
Science-technology - Mar 31, 2020 , 12:54:04

హానర్‌ సరికొత్త మొబైల్‌ 30ఎస్‌

హానర్‌ సరికొత్త మొబైల్‌ 30ఎస్‌

హైదరాబాద్‌: చైనా ప్రీమియం మొబైల్‌ తయారీసంస్థ హానర్‌ తన 30 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ లైనప్‌లో 30ఎస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తున్నది. కిరిన్‌ 820 ప్రాసెసర్‌ కలిగిన ఇది 5జీకి సపోర్ట్‌ చేస్తుంది. 64 మెగాపిక్సల్‌ ఏఐ క్వాడ్‌ కెమెరా మ్యాడ్యూల్‌ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. 8జీబీ, 128 జీబీ, 8జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ను ఏప్రిల్‌ 7న చైనాలో విడుదల చేయనుంది. అయితే దేశంలో కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో దీని విడుదలపై ఏప్రిల్‌ 15 తర్వాత స్పష్టత రానుంది.  

6.5 ఇంచుల ఫుల్‌హెచ్‌డీ+ఐపీఎస్‌ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ 64 మెగాపిక్సల్‌ ప్రైమరీ సెన్సర్‌ కెమరాతోపాటు, నాలుగు కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం ను 4000ఎంఏహెచ్‌. ఇది భారత్‌లో సుమారు రూ.25,500, రూ.28,700లలో లభించనుంది.


logo