శనివారం 04 జూలై 2020
Science-technology - Jul 01, 2020 , 10:17:10

బీఎస్‌-6 హోండా 'లివో' విడుదల

బీఎస్‌-6 హోండా 'లివో' విడుదల

న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ 110 సీసీ కేటగిరిలో  కొత్త మోడల్‌   'లివో' బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది.    మంగళవారం దేశీయ మార్కెట్లోకి బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన  లివో 110 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది.  సరికొత్త హెడ్‌ల్యాంప్‌, స్టార్ట్‌/స్టాప్‌ స్విచ్‌, సర్వీస్‌ డ్యూ ఇండికేటర్‌, 5 స్టెప్‌ అడ్జెస్టబుల్‌ రియర్‌ సస్పెన్షన్‌ తదితర ఫీచర్లు కలిగిన కొత్త బైక్‌ ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధరను రూ.69,422గా నిర్ణయించారు. 

లివో బీఎస్‌-6 బై‌క్‌ రెండు  వేరియంట్లలో, 4 రంగుల్లో  లభ్యమవుతోంది. భారత్‌లో లివో   డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.69,422గా ఉండనుంది. లివో బీఎస్‌-4 ద్విచక్రవాహనం   కన్నా బీఎస్‌-6 మోడల్‌ ధర రూ.13వేల ఎక్కువగా ఉన్నది.  110 సీసీ కేటగిరిలో హోండా అందిస్తున్న నాలుగో మోడల్  ఇది.


logo