బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 08, 2020 , 14:39:15

మార్చి 19న హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈవెంట్‌.. విడుదల కానున్న కొత్త నోకియా ఫోన్లు..!

మార్చి 19న హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈవెంట్‌.. విడుదల కానున్న కొత్త నోకియా ఫోన్లు..!

మొబైల్స్‌ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్‌ మార్చి 19వ తేదీన లండన్‌లో ఓ ఈవెంట్‌ నిర్వహించనుంది. ఆ ఈవెంట్‌లో పలు నోకియా ఫోన్లను విడుదల చేయనున్నారు. నోకియా 1.2, నోకియా సి2 బడ్జెట్‌ ఫోన్లతోపాటు నోకియా 5.3, నోకియా 400 4జీ, నోకియా 5310 ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ తదితర ఫోన్లను విడుదల చేయనున్నారని సమాచారం. అలాగే పలు పాత నోకియా ఫోన్ల బ్రాండ్లను మళ్లీ కొత్తగా విడుదల చేస్తారని కూడా సమాచారం అందుతోంది. ఇక ఇవే కాకుండా నోకియా 8.3 పేరిట 5జీ ఫోన్‌ను కూడా విడుదల చేస్తారని తెలిసింది. ఈ ఫోన్ల గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది..! 


logo