శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Feb 20, 2020 , 13:37:10

రూ.2499కే హై ఫ్యూచర్‌ నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌

రూ.2499కే హై ఫ్యూచర్‌ నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌

హైఫ్యూచర్‌ కంపెనీ ఫ్లై బడ్స్‌ పేరిట నూతన  వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇవి బ్లూటూత్‌ 5.0 ద్వారా ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ అవుతాయి. వీటిలో ఎన్‌42 డైనమిక్‌ నియోడైమియం మాగ్నెట్‌ డ్రైవర్స్‌ను ఏర్పాటు చేసినందున సౌండ్‌ క్వాలిటీ బాగుంటుంది. డీప్‌ బేస్‌ను  ఇవి అందిస్తాయి. ఆపిల్‌ సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌లకు వీటిలో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఇవి 4 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్‌ కేస్‌తో అయితే 15 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చు. యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు ద్వారా వీటిని ఫాస్ట్‌గా చార్జింగ్‌ చేసుకోవచ్చు. రూ.2499 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ వినియోగదారులకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లలో లభిస్తున్నాయి. 


logo