ఆదివారం 07 మార్చి 2021
Science-technology - Mar 19, 2020 , 23:20:36

హెచ్‌ సీఎల్‌ నుంచి యాప్‌ స్కాన్‌ వీ-10

హెచ్‌ సీఎల్‌ నుంచి యాప్‌ స్కాన్‌ వీ-10

హైదరాబాద్‌: అగ్రగామి సాంకేతిక సంస్థ హెచ్‌ సీఎల్‌ టెక్నాలజీస్‌ సరికొత్త యాప్‌ స్కాన్‌ వీ-10ను రూపొందించినట్లు ప్రకటించింది. దీనిని ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అప్లికేషన్‌ సెక్యూరిటీ టెస్టింగ్‌లో ఈ యాప్‌ స్కాన్‌ వెర్షన్‌ అగ్రగామిగా నిలువనున్నదని తెలిపింది. యాప్‌ స్కాన్‌ ఆటోమేటెడ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ టెస్టింగ్‌, నిర్వహణా కార్యకలాపాలకు అవసరమైన పరిష్కారాలను అందిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంతోపాటు సాంకేతిక ప్రయోజనాలను అందించనున్నది. 


యాప్‌ స్కాన్‌ వెర్షన్‌ ప్రయోజనాలు 

  • వేగంగా లోపాలను గుర్తించి ఖచ్చితమైన పరిష్కారాలను అందిస్తుంది. 
  • డేటా భద్రత విషయంలో మెరుగైన పనితీరు కనబరుస్తుంది. 
  • ప్రమాదాలను పసిగట్టి వాటిని అంతరాయం లేకుండా నియంత్రిస్తుంది.

VIDEOS

logo