శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Science-technology - Mar 24, 2020 , 15:31:41

కరోనా పై గూగుల్‌ కీలక నిర్ణయం..

కరోనా పై గూగుల్‌ కీలక నిర్ణయం..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై  అవగాహన కల్పించేందుకు తనదైన శైలిలో స్పందించింది. ఈ వైరస్‌నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవసమయ్యే సమాచారం కోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ టంప్‌ విలేకరుల సమావేశం నిర్వహించిన వారం తర్వాత గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కరోనా వైరస్‌ కోసం గూగుల్‌ ఒక స్క్రీనింగ్‌ వెబ్‌సైట్‌ తీసుకోవాలనీ, తద్వారా ఇది ప్రజలను నిర్దేశించాలని టంప్‌ పేర్కొన్న నేపథ్యంలో https://www.google.com/covid19/అనే వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది.

ఈ అవగాహన, నివారణ, స్థానిక వనరులపై ఈ వెబ్‌సైట్‌ దృష్టి కేంద్రీకరించింది.కోవిడ్‌ -19 సమాచారం రాష్ర్టాల ఆధారంగా, భ్రదత, నివారణ  మార్గాలతోపాటు , కోవిడ్‌  సంబంధ సెర్చ్‌, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్‌ తెలిపింది.  సెర్చ్‌  ఫలితాల్లో, గూగుల్‌ మ్యాప్స్‌లో నేరుగా కరోనా వైరస్‌ గురించి నమ్మదగిన సమాచారం అందేలా  చేస్తామని   సెర్చ్‌ దిగ్గజం తెలిపింది.  


logo