సోమవారం 25 జనవరి 2021
Science-technology - Nov 24, 2020 , 12:07:20

గూగుల్ టాస్క్‌ మేట్ యాప్‌తో సంపాదించండి!

గూగుల్ టాస్క్‌ మేట్ యాప్‌తో సంపాదించండి!

న్యూఢిల్లీ:  టెక్ జెయింట్ గూగుల్ నుంచి మ‌రో కొత్త యాప్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లో ఉన్న ఈ పెయిడ్ క్రౌడ్‌సోర్సింగ్ స‌ర్వీస్‌తో మీ స్మార్ట్‌ఫోన్ నుంచే టాస్క్‌ల‌ను పూర్తి చేసి సంపాదించ‌వ‌చ్చు. ఈ యాప్ ద్వారా కొంద‌రు ఎంపిక చేసిన యూజ‌ర్లు త‌మ‌కు అప్ప‌గించిన ప‌నుల‌ను పూర్తి చేస్తే.. గూగుల్ సంస్థ అందుకు త‌గిన మొత్తం చెల్లిస్తుంది. ఈ టాస్క్ మేట్ ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లోనే ఉంది. త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చే అవకాశాలు ఉన్నాయి. బీటా టెస్టింగ్ ద‌శ‌లో కొంద‌రు ఎంపిక చేసిన టెస్ట‌ర్ల‌కు రెఫ‌ర‌ల్ కోడ్ వ్య‌వ‌స్థ ద్వారా ముందుగానే యాక్సెస్ వ‌స్తుంది. ఈ గూగుల్ స‌ర్వీస్ ఇప్పుడు ఇండియాలోనూ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు ఓ రెడిట్ యూజ‌ర్ పోస్ట్ చేశాడు. గూగుల్ యాప్ ఎకోసిస్ట‌మ్‌కు సంబంధించిన టాస్క్‌ల‌ను పూర్తి చేస్తే మీకు ఇండియ‌న్ క‌రెన్సీలో చెల్లించే టాస్క్ మేట్ యాప్‌ను గూగుల్ ఇండియాలో టెస్ట్ చేస్తోంద‌ని ఆ పోస్ట్‌లో ఉంది. 

గూగుల్ టాస్క్‌మేట్ ఎలా ప‌ని చేస్తుంది?

ద‌గ్గ‌ర్లోని టాస్క్‌ల‌ను గుర్తించి, వాటిని పూర్తి చేస్తే సంపాదించే అవ‌కాశం క‌ల్పిస్తుంది. మీరు చేసిన టాస్క్‌ల‌కు సంబంధించి క్యాష్ అవుట్ ద్వారా చెల్లింపులు చేస్తుంది. ఏదైనా ఇ-వాలెట్‌కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం లేదా ఇన్‌-యాప్ పేమెంట్ పార్ట్‌న‌ర్ ద్వారా డ‌బ్బు చెల్లిస్తుంది. ఈ టాస్క్‌లు చాలా సింపుల్. వీటిని సిట్టింగ్ లేదా ఫీల్డ్ రెండు కేట‌గిరీలుగా విభ‌జించారు. సిట్టింగ్ అంటే ట్రాన్స్‌స్క్రైబింగ్‌, ఇంగ్లిష్ నుంచి మీ భాష‌లోకి అనువ‌దించ‌డం లాంటి ప‌నులు. ఇక ఫీల్డ్ టాస్క్‌ల‌లో భాగంగా మీకు ద‌గ్గ‌ర‌లోని రెస్టారెంట్లు లేదా ఇత‌ర ప్ర‌దేశాల ఫొటోలు తీసి పంపిచాల్సి ఉంటుంది. దీని ద్వారా త‌న మ్యాపింగ్ వివ‌రాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి గూగుల్ ప్ర‌య‌త్నిస్తోంది. 


logo