శుక్రవారం 23 అక్టోబర్ 2020
Science-technology - Oct 17, 2020 , 22:43:14

పాట మర్చిపోయారా..గూగుల్‌ సెర్చ్‌లో ట్యూన్‌ హమ్‌ చేయండి..!

పాట మర్చిపోయారా..గూగుల్‌ సెర్చ్‌లో ట్యూన్‌ హమ్‌ చేయండి..!

హైదరాబాద్‌: మీకిష్టమైన పాటను మర్చిపోయారా. కానీ దాన్ని వినాలనుకుంటున్నారా? ఇలాంటి వారికోసమే సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. పాటకు సంబంధించిన ట్యూన్‌ను మనం హమ్‌ చేస్తే ఆ పాట వచ్చేస్తుంది. గూగుల్ తన ఈ సరికొత్త ఫీచర్ ‘హమ్ టు సెర్చ్’ను అక్టోబర్ 15, 2020 న ప్రకటించింది. మీకు గుర్తులేని పాటను గూగుల్ సెర్చ్ విడ్జెట్ లేదా గూగుల్ యాప్ తాజా వెర్షన్‌లో హమ్ చేసి వినవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత గూగుల్ అసిస్టెంట్‌కు విస్తరించింది. ‘హే గూగుల్, ఈ పాట ఏమిటి?’ అని పది నుంచి పదిహేను సెకన్ల పాటు ట్యూన్‌ హమ్‌చేస్తే సంబంధిత పాటల జాబితా వస్తుంది. అందులో మనకిష్టమైన పాటను ఎంపికచేసుకోవచ్చు.  ట్యూన్‌ను బట్టి పాటను మెషీన్ లెర్నింగ్ అల్గోరిథం గుర్తిస్తుంది. గూగుల్ మ్యూజిక్ రికగ్నిషన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మోడల్స్ ట్యూన్  హ్యుమన్‌ వెర్షన్‌ స్టూడియోలో రికార్డ్ చేసిన పాటతో సరిపోలుతాయి. ఈ మ్యూజిక్ రికగ్నిషన్ టెక్నాలజీని గూగుల్ పిక్సెల్ ఫోన్లలో కనిపించే 'నౌ ప్లేయింగ్' ఫీచర్, గూగుల్ యాప్ లోని సౌండ్ సెర్చ్ ఫీచర్‌లో ఉపయోగించారు. ‘హమ్ టు సెర్చ్’ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో ఇరవైకి పైగా భాషలలో, అలాగే, ఐఓఎస్‌ వినియోగదారులకు ఆంగ్లంలో అందుబాటులో ఉంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo