మంగళవారం 24 నవంబర్ 2020
Science-technology - Oct 24, 2020 , 16:45:30

ప్లే స్టోర్ నుంచి మూడు పాపులర్ యాప్స్ ఔట్...!

 ప్లే స్టోర్ నుంచి మూడు పాపులర్ యాప్స్ ఔట్...!

హైదరాబాద్ : గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలు పాటించని యాప్స్ పై మూడు యాప్స్ కు గూగుల్ షాక్ ఇచ్చింది. మూడు పాపులర్ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి  తొలగించింది. చిన్నారుల కోసం రూపొందించిన ఆ యాప్స్ డేటాను దొంగిలిస్తున్నాయన్న కారణాలతో డిలీట్ చేశారు. ఇంటర్నేషనల్ డిజిటల్ అకౌంటబిలిటీ కౌన్సిల్ (ఐడిసిఏ) ఈ యాప్స్ విషయంలో ఆందోళన వ్యక్తం చేయడంతో ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగించారు. ప్రిన్సెస్ సలోన్, నంబర్ కలరింగ్, క్యాట్స్ అండ్  కాస్ప్లే  అనే మూడు యాప్స్  గూగుల్ ప్లే స్టోర్  నిబంధనలకు విరుద్ధంగా  ఉన్నాయి. అంతేకాదు డేటాను సేకరించి ఇతరులకు చేరవేస్తూ ఉన్నాయని తేలింది. దీంతో వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించక తప్పలేదు. 

"డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లడం చాలా ప్రమాదకరం' అని ఇంటర్నేషనల్ డిజిటల్ అకౌంటబిలిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ క్వెంటిన్ పాల్ఫ్రే తెలిపారు. నిబంధనలను అతిక్రమించినట్లు తెలిసిన వెంటనే తాము చర్యలు తీసుకుంటామని.. గతంలో కూడా పలు యాప్స్ మీద వేటు వేశామని.. భవిష్యత్తులో కూడా నిబంధనలను బేఖాతరు చేసిన యాప్స్ మీద కఠినంగా వ్యవహరిస్తామని గూగుల్ తెలిపింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.