బుధవారం 27 జనవరి 2021
Science-technology - Nov 25, 2020 , 17:58:13

గూగుల్ పే న‌గ‌దు బ‌దిలీకి ఫీజు వ‌సూలు చేస్తుందా?

గూగుల్ పే న‌గ‌దు బ‌దిలీకి ఫీజు వ‌సూలు చేస్తుందా?

గూగుల్ పే ఇక నుంచి త‌న ప్లాట్‌ఫామ్‌పై న‌గ‌దు బ‌దిలీ చేయ‌డానికి ఫీజు వ‌సూలు చేయ‌నుంద‌న్న వార్త‌లు ఈ మ‌ధ్య వైర‌ల్‌గా మారాయి. ఈ యాప్‌ను పెద్ద ఎత్తున వాడుతున్న ఇండియ‌న్ యూజ‌ర్లు ఈ వార్త‌ల‌పై ఆందోళ‌న చెందారు. అయితే దీనిపై బుధ‌వారం గూగుల్ వివ‌ర‌ణ ఇచ్చింది. ఇండియాలోని యూజ‌ర్ల‌కు తాము ఎలాంటి ఫీజు వ‌సూలు చేయ‌బోమ‌ని గూగుల్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. తాము చెప్పిన ఛార్జీలు అమెరికా యూజ‌ర్లకే వ‌ర్తిస్తాయ‌ని, ఇండియాలోని గూగుల్ పే లేదా గూగుల్ పే ఫ‌ర్ బిజినెస్ యాప్‌ల‌కు ఎలాంటి ఛార్జీలు వ‌ర్తించ‌వు అని ఆ గూగుల్ ప్ర‌తినిధి స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఏడాది గూగుల్ పేను కొత్త‌గా రీలాంచ్ చేస్తున్నామ‌ని గూగుల్ ప్ర‌క‌టించ‌గానే.. త‌క్ష‌ణ న‌గ‌దు బ‌దిలీ కోసం ఛార్జీ వ‌సూలు చేయ‌నుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. గ‌తేడాది సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఇండియాలో గూగుల్ పేను 6.7 కోట్ల మంది వాడుతున్నారు. వీళ్లంతా క‌లిసి ఏడాదికి 11000 కోట్ల డాల‌ర్ల చెల్లింపులు చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి గూగుల్ పే ఫ‌ర్ బిజినెస్‌కు కూడా 30 ల‌క్ష‌ల మంది మ‌ర్చంట్స్ ఉన్నార‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. 


logo