మంగళవారం 01 డిసెంబర్ 2020
Science-technology - Sep 29, 2020 , 13:57:51

గూగుల్ మీట్‌లో సరికొత్త ఫీచర్...

 గూగుల్ మీట్‌లో సరికొత్త ఫీచర్...

బెంగళూరు : ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ రూపొందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గూగుల్ మీట్ మరో కొత్త ఫీచర్ ను  రూపొందించింది. కాల్ మాట్లాడేటప్పడు శబ్దాలను ఫిల్టర్ చేసి, నాయిస్ ను తగ్గించి, సౌండ్ క్వాలిటీని పెంచగల సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్లలో విడుదల చేసింది. ఇవే కాకుండా పాఠశాలలకు, విద్యార్థులకు అవసరమయ్యే మరిన్ని అంశాలపై గూగుల్ దృష్టి సారించింది. గూగుల్ మీట్ లో పాఠాలు వినే విద్యార్థుల కోసం అటెండెన్స్ రిపోర్ట్ ఫీచర్ను అభివృద్ధి చేయనుంది. నాయిస్ వినిపించదు ఇంతకుముందే బ్యాక్గ్రౌండ్లో యాప్ను బ్లర్ చేసుకునే ఆప్షన్ను గూగుల్ విడుదల చేసింది. తాజాగా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ను వినియోగదారుల కోసం అభివృద్ధి చేసింది.

ఇప్పుడు వినియోగదారులు బిజీగా ఉండే రోడ్ల పక్కన, హోటళ్ల వద్ద కూడా ఈ ఫీచర్ సాయంతో అంతరాయం లేకుండా కాల్ చేసుకోవచ్చు. కీబోర్డ్ టైపింగ్, తలుపులు తెరవడం, మూసివేయడం వంటివి చేసినప్పుడు వచ్చే శబ్దాలను, కిటికీ నుంచి వచ్చే నాయిస్ను ఈ ఫీచర్ నిరోధిస్తుంది. సౌండ్ ఫిల్టర్ చేయడం ద్వారా అవతలి వారితో అంతరాయం లేకుండా మాట్లాడుకోవచ్చు. కాల్ మాట్లాడేటప్పుడు వాయిస్ నుంచి అనవసర శబ్దాలను వేరుచేసేందుకు గూగుల్ స్పెషల్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొం దించింది . ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదని గూగుల్ తెలిపింది.  ప్రస్తుతం జీ సూట్ ఎంటర్ప్రైజ్, జీ సూట్ ఎంటర్ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ కస్టమర్లకే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అప్డేట్ లభిస్తుంది. జీ సూట్ బేసిక్, జీ సూట్ బిజినెస్, జీ సూట్ ఫర్ నాన్ ప్రాఫిట్ అకౌంట్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.