బుధవారం 08 జూలై 2020
Science-technology - May 09, 2020 , 11:16:28

త్వ‌ర‌లో క్రోమ్‌లో గూగుల్ డుయో గ్రూప్ కాలింగ్

త్వ‌ర‌లో క్రోమ్‌లో గూగుల్ డుయో గ్రూప్ కాలింగ్

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇప్ప‌టి వ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ డుయో గ్రూప్ కాలింగ్‌ను వాడుతున్నాం. త్వ‌ర‌లో ఈ సౌక‌ర్యం గూగుల్ క్రోమ్‌లో రానుంది. క‌రోనా వైర‌స్ సంద‌ర్భంగా బంధువులు, స్నేహితులు, స‌హ‌చ‌రులు ఇలా అంద‌రికి దూరంగా ఉండాల్సిన స‌మ‌యంలో గూగుల్ డుయోలో తాజా ఫీచ‌ర్లు ప్ర‌క‌టించింది. వారం రోజుల్లో క్రోమ్‌లో దీనికి సంబంధించిన‌ ప్రివ్యూ ప్రారంభమ‌వుతుంది. కొత్త లేఅవుట్‌తో పాటు వెబ్‌లో డుయో గ్రూప్‌కాంలింగ్ అందుబాటులోకి వ‌స్తుంది. 

ఎక్కువ మంది గ్రూప్ కాలింగ్‌కు ఇది ఉప‌యోగ‌ప‌డ‌నుంది. గూగుల్ అకౌంట్ ఉన్న‌వారు ఎవ‌రైనా స్పేహితులు, బంధువులు, కుటుంబ స‌భ్య‌లు పంపిన లింక్ ద్వారా గ్రూప్ కాల్‌లో చేర‌వ‌చ్చు. గూగుల్ డ్యూయో గ్రూప్ కాలింగ్‌ న‌డుస్తున్న‌ప్పుడు హ్యాంగ్ అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. గ్రూప్ కాలింగ్ న‌డిచే స‌మ‌యంలో మిగితా ఫ్యూచ‌ర్లు క‌నిపించ‌నివ్వ‌దు.

  త‌క్కువ బ్యాండ్‌విడ్త్ క‌నెక్ష‌న్‌లో కూడా నాణ్య‌మైన, క్లారిటితో కూడిన‌ వీడియో కాల్ స‌దుపాయం క‌ల్పించ‌డానికి స‌ర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం కొత్త వీడియో కోడెక్ టెక్నాల‌జీని రూపొందించింది. వీడియో కాలింగ్ స‌మ‌యంలో ఫోటోను క్లిక్ చేయ‌డానికి వినియోదారుల‌కు అవ‌కాశం ఉంటుంది. ఒకే సారి 12 మంది వినియోగ‌దారులు గూగుల్ వీడియో కాల్‌లో పాల్గొన‌వచ్చు. 24 గంట‌ల త‌రువాత మీకు వ‌చ్చిన వీడియో, వాయిస్ మెసేజ్‌లు అటో సేవ్ అయ్యేలా ఫ్యూచ‌ర్‌ను క‌ల్పిస్తుంది. ప్ర‌తి ఏడు రోజుల్లో 10 మిలియ‌న్లు పైగా కొత్త వ్య‌క్తులు డుయో కోసం సైన్ అప్ చేస్తున్నార‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. 


logo