మంగళవారం 02 జూన్ 2020
Science-technology - Mar 28, 2020 , 15:18:35

గూగుల్‌ డుయోతో ఇక 12 మంది మాట్లాడుకోవచ్చు

గూగుల్‌ డుయోతో ఇక 12 మంది మాట్లాడుకోవచ్చు

హైదరాబాద్‌: ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌ తన డుయో చాట్‌ ద్వారా గ్రూప్‌ కాల్‌లో ఒకేసారి 12 మంది మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. దీంతో అత్యధికమంది తమ ఇండ్లకే పరమితమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందితో మాట్లాకునేలా ఒక గ్రూప్‌ కాల్‌లో పాల్గొనేవారి సంఖ్యను 8 నుంచి 12కు పెంచింది. ఈ రోజు నుంచే అది మల్లోకి వచ్చింది.  అయితే ఇప్పటికే ఆపిల్‌ తన ఫేస్‌టైమ్‌లో 32 మంది, స్కైప్‌, మెసెంజర్‌లో 50 మంది, జూమ్‌కు చెందిన ఫ్రీ టైర్‌లో 100 మంది ఒకే కాల్‌ ద్వారా మాట్లాడుకునే అవకాశం అందుబాటులో ఉంది. 


logo