వాషింగ్టన్: ఇంటర్నెట్లో ఏది కావాలన్నా వెతికి పెట్టే గూగుల్ ( Google Birthday ) సోమవారంతో 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. తన బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ డూడుల్ క్రియేట్ చేసింది. చాక్లెట్ కేక్‌తో కొత్త గూగుల్ డూడుల్ ఆకట్టుకుంటోంది. ప్రముఖులు పుట్టిన రోజులు, చరిత్రలో ప్రత్యేకమైన రోజులను తన డూడుల్స్‌తో జరుపుకునే గూగుల్.. ఇప్పుడు తన బర్త్‌డేకు కూడా స్పెషల్ డూడుల్‌ను క్రియేట్ చేసింది. 1998, సెప్టెంబర్ 27న అమెరికాకు చెందిన సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ఈ గూగుల్‌ను స్థాపించిన విషయం తెలిసిందే.
సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన గూగుల్.. ఆ తర్వాత ఆన్లైన్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీలు, క్లౌడ్ కంప్యూటింగ్, చాటింగ్ బాట్లాంటి సర్వీస్‌లను ప్రారంభించింది. 1995లో బ్రిన్, పేజ్ జోడీ ఈ గూగుల్ గురించి తొలిసారి ఆలోచించారు. 1996లో ఓ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించారు. మొదట్లో దీనిని బ్యాక్రబ్గా పిలిచారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 భాషల్లో వందల కోట్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి.