మంగళవారం 04 ఆగస్టు 2020
Science-technology - Jul 06, 2020 , 17:45:16

60వేల ఏళ్ల నుంచే మానవునిలో కరోనా వైరస్‌ మూలం?

60వేల ఏళ్ల నుంచే మానవునిలో కరోనా వైరస్‌ మూలం?

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి ప్రపంచంలోని పనితీరునే మార్చేసింది. అన్ని దేశాలను అతలాకుతలం చేసి, నిశ్చలస్థితికి తీసుకువచ్చిన వ్యాధి ఇదే. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ వ్యాధి రావడానికిగల కచ్చితమైన కారణాన్ని ఇప్పటివరకూ ఏ వైద్యుడుగానీ, శాస్త్రవేత్తగానీ కనుగొనలేదు.

కాగా, న్యూజెర్సీలోని ప్రిన్‌స్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ విస్తుగొలుపే విషయాన్ని వెల్లడించారు. కొవిడ్‌-19కు లింక్‌ ఉన్న డీఎన్‌ఏ భూమిపై 60వేల ఏళ్లకు ముందున్న నియాండెర్తల్‌ మానవుల నుంచి మనలో కొనసాగుతున్నట్లు వారి అధ్యయనంలో తేలింది. అయితే, ఈ విషయం కొవిడ్‌-19పై పరిశోధన చేస్తున్న ప్రత్యేక విభాగం శాస్త్రవేత్తలకు తెలియదు. 

60 వేల ఏళ్లక్రితం మానవునిలో జరిగిన కొవిడ్‌ సంతానోత్పత్తి నేటికీ ప్రభావం చూపుతున్నదని కొత్త అధ్యయనాల్లో పాల్గొనని ప్రిన్‌స్టన్‌ వర్సిటీ జన్యు శాస్త్రవేత్త జాషువా అకీ పేర్కొన్నారు. ఈ జీన్‌ స్పాన్‌కు సంబంధించిన మానవ చరిత్ర అస్పష్టంగా ఉందని, నియాండెర్తల్‌ మానువుని క్రోమోజోమ్ 3లో ఆరు జన్యువులున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. బంగ్లాదేశ్‌లో 63 శాతం మంది ప్రజలు కనీసం ఈ జన్యువుకు సంబంధించిన ఒక కాపీని కలిగి ఉన్నారని వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల విషయానికొస్తే, మానవులలో ఈ జన్యువు అంతగా లేదని గుర్తించింది. కేవలం ఎనిమిది శాతం మంది యురోపియన్లు, నాలుగు శాతం మంది తూర్పు ఆసియన్లలో మాత్రమే ఉన్నట్లు తేల్చింది.  

ఇదిలా ఉండగా, ఈ ప్రాణాంతక నావల్‌ కరోనావైరస్ వివిధ వయసులు, లింగం(జెండర్‌)పై ఎందుకు వేర్వేరు ప్రభావాలను చూపుతుందనే దానిపై పరిశోధకులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు. మహిళలతో పోలిస్తే వృద్ధులకు ఎందుకు ఎక్కువ ముప్పుంది లేదా పురుషులు ఎందుకు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారో అర్థం చేసుకునేందుకు కూడా వారు ప్రయత్నిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo