శనివారం 23 జనవరి 2021
Science-technology - Nov 30, 2020 , 15:30:28

ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌..80శాతం వ‌ర‌కు త‌గ్గింపు

ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌..80శాతం వ‌ర‌కు త‌గ్గింపు

ముంబై:  వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు  ప‌్ర‌ముఖ ఇ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స‌రికొత్త ఆఫ‌ర్‌తో ముందుకొస్తోంది. ప్ర‌తీ నెల మొద‌టి మూడు రోజుల పాటు ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో ప్ర‌త్యేక సేల్ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. ఫ్లిప్‌స్టార్ట్ సేల్‌లో భాగంగా డిసెంబ‌ర్ 1,2,3 తేదీల్లో భారీ డిస్కౌంట్లు, బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది.  ఎల‌క్ట్రానిక్ యాక్సెస‌రీల‌పై 80శాతం, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేట‌ర్ల‌పై 50శాతం వ‌ర‌కు డిస్కౌంట్ అందిస్తోంది. 

పాదరక్షలు, బట్టలు, క్రీడా పరికరాలు, ఫర్నిచర్,  గృహాలంక‌ర‌ణ‌  త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌పై కూడా త‌గ్గింపును ప్ర‌క‌టించింది.  హెడ్‌ఫోన్‌లు,  స్పీకర్లపై 70% వరకు తగ్గింపును అందిస్తోంది.   ల్యాప్‌టాప్‌లపై 30% వరకు తగ్గింపులు ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌లు,   ఫిట్‌నెస్ బ్యాండ్‌ వంటి వాటిని కొనేవారికి మంచి త‌గ్గింపును ప్ర‌క‌టించింది.  నోకాస్ట్ ఈఎంఐ స‌దుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్లు, వారంటీ పొడ‌గింపు వంటి స‌దుపాయం కూడా ఉంది. logo