బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Feb 19, 2020 , 17:20:22

రూ.3299కే ఫింగర్స్‌ కంపెనీ నూతన బ్లూటూత్‌ స్పీకర్‌

రూ.3299కే ఫింగర్స్‌  కంపెనీ నూతన బ్లూటూత్‌ స్పీకర్‌

డిజిటల్‌ యాక్ససరీస్‌ తయారీదారు ఫింగర్స్‌.. నాకౌట్‌ బేబీ పేరిట భారత్‌లో ఓ నూతన బ్లూటూత్‌ స్పీకర్‌ను లాంచ్‌ చేసింది. దీనికి షాక్‌ ప్రూఫ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్‌ ద్వారా ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే 24వాట్ల సామర్థ్యం ఉన్న 360 డిగ్రీ సౌండ్‌ను ఇచ్చే స్పీకర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ స్పీకర్‌ 12 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అలాగే యూఎస్‌బీ, ఆక్స్‌ కనెక్టివిటీ, ఎఫ్‌ఎం రేడియో తదితర ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. రూ.3299 ధరకు ఈ స్పీకర్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 


logo