ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 12, 2020 , 17:08:36

సరికొత్త ఫీచర్లతో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్

సరికొత్త ఫీచర్లతో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్

ముంబై : ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ ఫెరారీ సరికొత్త ఎఫ్8 ట్రిబ్యూటో కారును ఇటీవలే భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4.02 కోట్లు. సుప్రసిద్ధ ఫెరారీ 488 జిటిబి స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు విడుదలైన మోడల్ ఇది. కొత్త ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారులో అదే 3.9-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 720 బిహెచ్‌పి శక్తిని , 770 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో ఇప్పటి వరకు తాము తయారు చేయని అత్యంత వేగవంతమైన సిరీస్-ప్రొడక్షన్ మిడ్ ఇంజన్ సూపర్ కార్ అని కంపెనీ పేర్కొంది. ఎఫ్8 ట్రిబ్యూటో గరిష్టంగా గంటకు 340 కి.మీ వేగంతో దూసుకెళ్తుందని కంపెనీ తెలిపింది.

ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో గత మోడల్ కంటే 40 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. 15 శాతం ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో దాని మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే చాలా పదునైన, అగ్రెసివ్ స్టైలిష్ గా ఉంటుంది. ఫెరారీ 488 జిటిబిలోని అనేక డిజైన్ ఎలిమెట్స్‌ను కలిగి ఉంటుంది. కొత్త ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో స్టైలింగ్ అప్‌డేట్స్‌లో రిఫ్రెష్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, పదునైన క్రీజ్ లైన్స్ ఉన్నాయి.

ట్రిబ్యూటో దాని మునపటి 488 జిటిబితో పోలిస్తే మరింత స్టైలిష్, స్పోర్టీగా కనిపిస్తుంది.ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కాక్‌పిట్‌లో పలు డిజిటల్ స్క్రీన్లు, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద పాడిల్ షిఫ్టర్లను కలిగి ఉంటుంది. ఫెరారీ ఉత్పత్తి చేసే చివరి హైబ్రిడ్ కాని మిడ్-ఇంజిన్ V8 పవర్డ్ సూపర్ కార్‌గా ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించనున్నది.logo