సోమవారం 18 జనవరి 2021
Science-technology - Dec 03, 2020 , 12:27:25

ఆ గేమ్‌కు మూడు రోజుల్లోనే ప‌ది ల‌క్ష‌ల ప్రి రిజిస్ట్రేష‌న్లు

ఆ గేమ్‌కు మూడు రోజుల్లోనే ప‌ది ల‌క్ష‌ల ప్రి రిజిస్ట్రేష‌న్లు

ప‌బ్‌జీ గేమ్‌ను భార‌త ప్ర‌భుత్వం బ్యాన్ చేసిన త‌ర్వాత చాలా మంది గేమ్ ల‌వ‌ర్స్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆ గేమ్ మ‌ళ్లీ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లోపే ఆ గేమ్‌కు ప్ర‌త్యామ్నాయంగా వ‌స్తున్న‌ FAU-G మొబైల్ గేమ్‌.. గూగుల్ ప్లే స్టోర్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ప్ర‌స్తుతానికి కేవ‌లం ప్రి రిజిస్ట్రేష‌న్ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉన్న ఈ గేమ్ కోసం.. పెద్ద సంఖ్య‌లో ఇండియ‌న్ యూజ‌ర్లు ఎదురు చూస్తున్నారు. ఈ గేమ్‌ను రూపొందించిన బెంగ‌ళూరు సంస్థ ఎన్‌కోర్ గేమ్స్.. ప్రిరిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభించామ‌ని చెప్పిన మూడు రోజుల్లోనే 10 ల‌క్ష‌ల మంది రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ గేమ్ అక్టోబర్‌లో వ‌స్తుంద‌ని భావించినా.. ఇప్ప‌టికీ ఇంకా లాంచ్ కాలేదు. గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్న స‌మ‌యంలో ప్రిరిజిస్ట్రేష‌న్లు చేయించుకున్న వారికి పుష్ నోటిఫికేష‌న్లు వ‌స్తాయ‌ని ఎన్‌కోర్ గేమ్స్ తెలిపింది. ప్ర‌స్తుతానికి కేవ‌లం గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం FAU-G ప్రిరిజిస్ట్రేష‌న్ల‌కు అవ‌కాశం ఉంది. ఆపిల్ యాప్ స్టోర్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు. త‌మ గేమ్‌కు వ‌చ్చిన ఈ స్పంద‌నపై సంతోషం వ్య‌క్తం చేసిన ఎన్‌కోర్ గేమ్స్‌.. యూజ‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది. అటు సెప్టెంబ‌ర్‌లో నిషేధానికి గురైన ప‌బ్‌జీ కూడా త్వ‌ర‌లోనే ప‌బ్‌జీ మొబైల్ ఇండియాగా యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్న విష‌యం తెలిసిందే.