శుక్రవారం 07 ఆగస్టు 2020
Science-technology - Jul 04, 2020 , 16:35:46

టిక్‌టాక్‌పై నిషేధంతో.. నెటిజ‌న్ల‌కు ఫేవ‌రెట్‌గా మారిన డబ్‌షూట్

టిక్‌టాక్‌పై నిషేధంతో.. నెటిజ‌న్ల‌కు ఫేవ‌రెట్‌గా మారిన డబ్‌షూట్

హైదరాబాద్‌ :  చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించ‌డంతో.. డబ్‌షూట్ యాప్‌కు భార‌తీయ నెటిజ‌న్ల‌లో ఆద‌ర‌ణ పెరిగింది. హైద‌రాబాద్‌కు చెందిన ఎంట‌చ్ ల్యాబ్స్ అనే సంస్థ రూపొందించిన ఈ వీడియో షేరింగ్ సామాజిక మాధ్య‌మానికి ప్రాంతీయ భాషాభిమానుల్లో మంచి ఆద‌ర‌ణ క‌నిపిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్‌లో దీని డౌన్‌లోడ్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. 

కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డానికి ముందు టిక్‌టాక్‌కు భార‌త‌దేశంలో 100 మిలియ‌న్ల మందికి పైగా యూజ‌ర్లు ఉండేవారు. ఇప్పుడు అది అందుబాటులో లేక‌పోవ‌డంతో వాళ్లంతా ప్ర‌త్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటివారికి డబ్‌షూట్ బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఈ ప్లాట్‌ఫాంలో ప్ర‌తిరోజూ 15 వేల‌కు పైగా కొత్త వీడియోలు షేర్ అవుతున్నాయి. దాంతో దేశంలో వీడియో షేరింగ్ సామాజిక మాధ్య‌మాల్లో అతి పెద్ద‌వాటిలో ఒక‌టిగా ఇది రూపొందుతోంది.logo