e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News అంతరిక్షంలో పెరుగుతున్న డ్రాగన్ జోక్యం

అంతరిక్షంలో పెరుగుతున్న డ్రాగన్ జోక్యం

అంతరిక్షంలో పెరుగుతున్న డ్రాగన్ జోక్యం

బీజింగ్ : త‌మ సొంత‌ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే ప‌నిలో చైనా ముందడుగు వేస్తున్న‌ది. వీలైనంత త్వ‌ర‌గా అంతరిక్షంలో ప‌రిశోధ‌నా కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు చైనా చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్న‌ది. ఇందుకుగాను ముగ్గురు చైనా వ్యోమగాములు గురువారం అంత‌రిక్షంలోకి పంపుతున్న‌ది. భూ కక్ష్యలో ఈ అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిక‌ల్లా పూర్తిచేయాల‌ని చైనా లక్ష్యంగా పెట్టుకున్న‌ది. గురువారం బ‌య‌ల్దేరుతున్న ముగ్గురు వ్యోమగాములు మూడు నెలల పాటు అంత‌రిక్షంలో ఉండి ప‌నులు చ‌క్క‌బెట్ట‌నున్నారు. ఈ విష‌యాల‌ను చైనా దేశ అంతరిక్ష సంస్థ బుధవారం చేసిన ప్రకటన ద్వారా వెల్ల‌డించింది.

జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి అంతరిక్ష నౌక షెన్‌జౌ-12 ను ప్రయోగించనున్నట్లు ‘చైనా మ్యాన్డ్‌ స్పేస్ ఏజెన్సీ’ డైరెక్టర్ జీ క్వింగ్ తెలిపారు. ఈ చైనా అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములు నీ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హాంగ్బోను చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం అంతరిక్షంలోకి తీసుకువెళ్తుంది. అంతరిక్ష కేంద్రం నిర్మాణ సమయంలో వ్యోమగాములను తీసుకెళ్లే మొదటి మిషన్ ఇది. వచ్చే నెలలో జరుగ‌నున్న పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 100 ఏండ్ల‌ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఈ మిషన్‌ను ప్రారంభిస్తున్నారు.

వ‌చ్చే ఏడాది చివ‌రి క‌ల్లా సిద్ధం..?

- Advertisement -

షెన్‌జౌ-12 నౌక ద్వారా వెళ్లే వ్యోమగాములు కోర్ మాడ్యూల్‌లో నిలబడతారు. మూడు నెలలు అంతరిక్ష కక్ష్యలో వీరు ఉండ‌నున్నారు. ఈ అంతరిక్ష నౌకను లాంగ్ మార్చి-2 ఎఫ్ రాకెట్ ప్రయోగించనున్న‌ది. వచ్చే ఏడాది నాటికి అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధంగా ఉంచాల‌నే ల‌క్ష్యంతో ప‌నులు కొన‌సాగిస్తున్నారు. వ్యోమగాములు మూడు నెలలు అంతరిక్షంలో ఉండి నిర్మాణ‌, మరమ్మతు, నిర్వహణ పనులు చేప‌డ‌తార‌ని చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ కార్యాలయ డైరెక్టర్ యాంగ్ లివే తెలిపారు.

రోబోటిక్ చేయిపై యూఎస్ ఆందోళన..

అంతరిక్ష కేంద్రం సిద్ధమయ్యే ముందు ఈ ఏడాది 11 మిషన్లను అంతరిక్షంలోకి పంపాలని చైనా యోచిస్తున్న‌ది. అధికారిక మీడియా నివేదికల ప్రకారం, వీటిలో మూడు మాడ్యూల్స్ కోసం, నాలుగు కార్గో స్పేస్ షిప్స్ , నలుగురు సిబ్బందిని పంప‌నున్నారు. చైనా అంతరిక్ష కేంద్రంలో రోబోటిక్ చేయి ఉంటుంది. దీని గురించి అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్న‌ది. ఈ రోబోటిక్ చేయిని త‌న‌ సైనిక కార్యకలాపాలకు చైనా ఉపయోగిస్తుంద‌ని అమెరికా భావిస్తున్న‌ది. ఈ రోబోటిక్ ఆర్మ్ ద్వారా అంతరిక్ష కేంద్రం సిద్ధం చేయనున్నట్లు చైనా తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

కొత్తిమీర‌-పుదీనా ప‌చ్చ‌డితో 7 ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. ఏవంటే..?

ఈ టెక్నాలజీతో ఎన్-95 మాస్క్‌లు, పీపీఈ కిట్ల‌ రీయూజ్ సాధ్యం..!

వండ‌ర్ వుమెన్ : త‌ల‌పై సామానుతో నీటిలో బైకుపై.. వీడియో వైర‌ల్‌

సింహాల‌తో కొట్లాడి పిల్ల‌ను ద‌క్కించుకున్న బర్రె.. వీడియో వైర‌ల్‌

చంప‌త్‌రాయ్‌ను తొల‌గించాల్సిందే : స్వామి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి

బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్‌లో రాజ‌కీయ నేత‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు

ఫైన‌ల్‌కు ముందు వివాదం : బ‌యో బ‌బుల్‌ను వీడిన కివీస్ ఆట‌గాళ్లు

గంగాన‌దిలో పెట్టె.. పెట్టెలో దేవ‌త‌ల మ‌ధ్య చిన్నారి..

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ : ఒక్క మ్యాచ్‌తో విజేత‌ను నిర్ణ‌యించ‌డం సరికాదు : స‌చిన్‌

చ‌రిత్ర‌లో ఈరోజు : అంత‌రిక్షంలోకి వాలెంటినా

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అంతరిక్షంలో పెరుగుతున్న డ్రాగన్ జోక్యం
అంతరిక్షంలో పెరుగుతున్న డ్రాగన్ జోక్యం
అంతరిక్షంలో పెరుగుతున్న డ్రాగన్ జోక్యం

ట్రెండింగ్‌

Advertisement