చాలామందికి ముఖ్యంగా నేటి యూత్ కు ఆన్ లైన్ గేమ్స్ అంటే పిచ్చి. యూత్ మాత్రమే కాదు.. చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు. నిజానికి.. ఆన్ లైన్ గేమ్స్ వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. కానీ.. గంటలు గంటలు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ కూర్చుంటే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. ఏది ఏమైనా.. ఒక లిమిట్ టైమ్ లో గేమ్స్ ఆడితే ఓకే. చాలామంది పోకీమాన్ గో గేమ్ ను ఆడుతుంటారు. పబ్ జీ లాగానే దానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఒకవేళ మీరు కూడా పోకీమాన్ గో గేమ్ లవర్స్ అయితే.. మీరు పోకీమాన్ గో గేమ్ ను విరివిగా ఆడితే.. దాంట్లో Pikachu Libre avatar బ్యాడ్జ్ ను గెలుచుకుంటే.. మీరు అదృష్టవంతులే. ఎందుకంటే.. మీకు పోకీమాన్ గో గేమ్ ను డెవలప్ చేసిన సంస్థలోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
ఈ గేమ్ లో కనీసం లేవల్ 7ను దాటిన వాళ్లకే కంపెనీలో ఉద్యోగం ఇచ్చేందుకు నియాంటిక్ గేమింగ్ కంపెనీ జాబ్ ఓపెనింగ్స్ ను లిస్ట్ చేసింది. GO Battle League లో పికాచు లిబ్రె అవతార్ ఐటెమ్స్ ను గెలుచుకున్నా చాలు.. ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం కోసం అర్హత సాధించినట్టే.
5 ఏళ్ల క్రితం ఈ గేమ్ ను లాంచ్ చేశారు. తాజాగా ఈ కంపెనీకి బ్యాటిల్, పోకీమాన్ గో గేమ్స్ కోసం సీనియర్ ప్రొడ్యూసర్స్ కావాలట. దానికి క్వాలిఫికేషన్ గా గేమ్ లోని గో బ్యాటిల్ లీగ్ లో పికాచు లిబ్రె అవతార్ ఐటెమ్స్ ను గెలుచుకుంటే చాలు. లేదంటే కనీసం పోకీమాన్ గో 7 లేవల్ దాటి ఉండాలి. దీనితో పాటు గేమింగ్ ప్రొడక్షన్ అనుభవం ఉంటే చాలు. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
World’s Oldest Living Man : ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఈయన.. వయసు ఎంతో తెలుసా?
వ్యవసాయం చేస్తున్న డాక్టర్.. గవర్నర్ ఇంటికి కూడా ఈయన పండించిన బియ్యమే వెళ్తాయి