గురువారం 22 అక్టోబర్ 2020
Science-technology - Jul 17, 2020 , 17:04:06

రెండు రోజుల్లో భూమిని చేరుకోనున్న ప్రమాదకర ఉల్క : నాసా

రెండు రోజుల్లో భూమిని చేరుకోనున్న ప్రమాదకర ఉల్క : నాసా

న్యూ ఢిల్లీ : ప్రసిద్ధ లండన్ ఐ కంటే పెద్దదిగా పేర్కొనబడిన 'ప్రమాదకర ఉల్క’(మెటియర్స్‌) కేవలం రెండు రోజుల్లోనే భూమికి చేరుకోనుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రపంచానికి హెచ్చరిక జారీ చేసింది. బర్మింగ్‌హామ్ లైవ్ నివేదిక ప్రకారం స్పేస్ రాక్ లండన్ ఐ కంటే ఈ ఉల్క (మెటియర్స్‌) ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఇది 135 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉండి భూమికి దగ్గరగా వస్తుంది. 

యూఎస్‌లోని స్పేస్‌ బొఫిన్లు దీనికి స్పేస్ రాక్ ఆస్టరాయిడ్ 2020ఎన్‌డీ అనిపేరు పెట్టాయి. అంతేకాకుండా ఇది చాలా ప్రమాదకారిగా పేర్కొన్నాయి. 170 మీటర్లు కలిగిన ఈ శిల జూలై 24న మన గ్రహానికి 0.034 ఖగోళ యూనిట్ల (ఏయూ) దగ్గరలోకి వస్తుందని సమాచారం.

ఇటీవల నాసా తన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జీపీఎల్‌) వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం  గ్రహాలు ఏర్పడిన తొలిరోజుల్లో గ్రహాల ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళికణాలు గ్రహాలతోపాటు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. అలాగే అంగారక గ్రహం నుంచి, చంద్రుడి నుంచి వెలువడిన ధూళి కణాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో తిరిగే వీటిని మెటియోరైడ్స్‌ (ఉల్కలు) అంటారు. 

భూమి తన కక్ష్యలో తాను తిరుగుతూ, ఈ మెటియోరైడ్స్‌ ఉండే ప్రాంతంలోకి వచ్చినపుడు వీటిలో కొన్ని భూమి ఆకర్షణ వక్తి వల్ల భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి. గంటకు సుమారు 30,000 కిలోమీటర్ల వేగంతో ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించడంతో వాటి ఉష్ణోగ్రత విపరీతంగా 1650 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరిగి కాంతిని వెదజల్లుతూ పడిపోతాయి. కొన్నిపెద్ద ఉల్కలు భూమి వాతావరణంలో ప్రవేశించాక మండిపోతూనే ప్రయాణించి భూమి ఉపరితలాన్ని ఢీ కొంటాయి. ప్రతి సంవత్సరం సుమారు 500 మెటియోరైట్స్‌ భూమిపై పడతాయి. ఇనుము, నికెల్‌లాంటి ఖనిజాలను కలిగి ఉండే వీటి మొత్తం బరువు 100 టన్నులు పైగా ఉంటుంది. ఇవి భూమిని తాకిన చోట లోతైన గోతులు ఏర్పడతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo