శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 08, 2020 , 17:57:49

కొవిడ్‌ వదిలినా.. అనారోగ్యం వెంటాడుతోంది

కొవిడ్‌ వదిలినా.. అనారోగ్యం వెంటాడుతోంది

లండన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి రోజుకో వార్త తెలుస్తోంది. ఇది ప్రజలందరినీ ఊపరిరాడనీయకుండా చేస్తోంది. కొవిడ్‌-19 వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి ఇది శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతూనే ఉంది. టీకా తయారీకి వారు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ఈ మహమ్మారి గురించి ఓ చేదునిజం తెలిసింది. కరోనా పాజిటివ్‌ వచ్చి కోలుకున్న వారిలో దీర్ఘకాలంపాటు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అలసట, బ్రీతింగ్‌ ప్రాబ్లమ్స్‌తోపాటు మానసిక సమస్యలూ తలెత్తే అవకాశముందని సైంటిస్టులు నిర్ధారించారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్న వంద మందిపై అధ్యయనం చేసిన బ్రిటన్‌లోని లీడ్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. వంద మందిలో 72 మందిలో అలసట సమస్య ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ఇంతకుముందు బ్రీతింగ్‌ ప్రాబ్లమ్‌ లేనివారికి కూడా కరోనా తర్వాత ఆ సమస్య ఎదురవుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఐసీయూలో ఉండి కోలుకున్న వారు తీవ్రమైన మనోవ్యాకులత రుగ్మత (పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌)తో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనానికి భారత సంతతి శాస్త్రవేత్త మనోజ్‌ శివన్‌ నేతృత్వం వహించారు. కాగా, తమ అధ్యయనం కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెబుతున్నదని మనోజ్‌ శివన్‌ పేర్కొన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo