బుధవారం 21 అక్టోబర్ 2020
Science-technology - Sep 13, 2020 , 17:34:13

వూహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ తయారైంది: చైనా శాస్త్రవేత్త

వూహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ తయారైంది: చైనా శాస్త్రవేత్త

కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నతరుణంలో చైనా వైరస్‌ నిపుణురాలు డాక్టర్‌ లీ మెంగ్‌ యెన్‌ నిజాలు బయటపెట్టారు. కరోనా వైరస్‌ను వుహాన్‌ ల్యాబులోనే తయారుచేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని చైనా  దాచిపెడుతున్నదని పేర్కొన్న ఆమె.. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను త్వరలో అందజేస్తామని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చైనా పెద్దలకు తెలుసునన్నారు.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. వైరస్‌కు సంబంధించిన అనేక సమాచారం డాక్టర్ లీ మెంగ్ యెన్‌ వద్ద ఉంది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను ఆమె అందరికీ త్వరలోనే వెల్లడిస్తుంది. డాక్టర్ లీ మెంగ్ తన జీవితం ప్రమాదంలో పడిపోవడంతో హాంగ్‌కాంగ్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఒక రహస్య ప్రదేశంలో ఉన్నారని తెలిపింది.

కరోనా వైరస్ ఎక్కడ నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా.. కరోనా జీనోమ్ సీక్వెన్స్ మానవుడి వేలిముద్రను పోలి ఉంటుందని డాక్టర్ లీ మెంగ్‌ యెన్‌ చెప్పారు. కరోనా వుహాన్ ల్యాబ్ నుండి వచ్చిందని, దాని జన్యు శ్రేణి మానవుడి వేలి ముద్రలాంటిదని, ఈ ప్రత్యేకత కారణంగా ఇది ప్రయోగశాలలో తయారు చేయబడిందని నిరూపించవచ్చునని, ఈ రుజువును ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను అని డాక్టర్‌ లీ మెంగ్‌ చెప్పారు. ''కరోనా వైరస్‌ వుహాన్‌లోని పశువుల మార్కెట్ నుంచి ప్రారంభమైంది. కానీ ఇది ఈ వైరస్ యొక్క స్వభావం కాదు. విజ్ఞానశాస్త్రంపై అవగాహన లేకపోయినా ఇది ప్రజల మరణానికి ప్రమాదంగా మారిందని గుర్తించవచ్చు. దేశం విడిచి వెళ్లిపోయే ముందు చైనా ప్రభుత్వం తనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తన డేటాబేస్ నుంచి తొలగించింది. చైనా ప్రభుత్వం, చైనా అధ్యక్షుడి స్వభావం నాకు బాగా తెలుసు కాబట్టి అతడి సహచరులు తన మాటలను పుకారుగా పేర్కొన్నారు'' అని డాక్టర్‌ లీ మెంగ్‌ తెలిపారు. 2019 డిసెంబర్ చివరలో అధ్యయనం చేయాల్సిందిగా ఆమెను సీనియర్లు కోరారు. ఈ వైరస్‌ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తొలుత చెప్తే సీనియర్లు అసలే  స్పందించలేదని, నా వృత్తికి న్యాయం చేయాలని భావిస్తున్నందున నిజాలు చెప్పాలని అనుకుంటున్నట్లు డాక్టర్‌ లీ మెంగ్‌ యెన్‌ చెప్పారు. డాక్టర్ లీ మెంగ్‌ యెన్ హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి వైరస్, ఇమ్యునాలజీని అభ్యసించారు. కరోనా వైరస్ అధ్యయనం చేసిన మొదటి శాస్త్రవేత్త డాక్టర్ యెన్.


logo