మంగళవారం 14 జూలై 2020
Science-technology - Jun 28, 2020 , 15:06:10

కరోనాను ఖతం చేసే రసాయనం సిద్ధం

కరోనాను ఖతం చేసే రసాయనం సిద్ధం

ముంబై : మన దేశంలోని ఐఐటీలు పరిశోధనల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలను ప్రజల ముంగిట తెస్తూ వారికి సాయంగా నిలుస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివరకు రకరకాల పరికరాలు, వస్తువులు తయారుచేసి అండగా నిలిచిన ఐఐటీలు.. మరో కొత్త రసాయనాన్ని తయారుచేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నది.

ఐఐటి ముంబైకి చెందిన ప్రొఫెసర్ రింటి బెనర్జీ ఒక కొత్త రసాయనాన్ని తయారుచేశారు. దానిని బహిర్గతం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కరోనా వైరస్ అంతమవుతుంది. ఈ రసాయనం పూసిన బట్టల నుంచి ముసుగులు, మాస్కుల వరకు తయారు చేసుకోవచ్చు. ఈ రసాయనం ఉన్న కారణంగా 20 కన్నా ఎక్కువ సార్లు ఉతికిన తరువాత కూడా ఈ పూత ప్రభావం తగ్గదు. గుజరాత్‌కు చెందిన ఒక సంస్థ కూడా ఈ రసాయనంతో పూసిన మాస్క్‌లు తయారు చేయడాన్ని ఇప్పటికే ప్రారంభించింది.

ముంబై ఐఐటీ బయోసైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ రింటి ఛటర్జీ వైద్య విద్యనభ్యసించి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. డాక్టర్‌గా సేవలందించడానికి బదులుగా పరిశోధనల పట్ల మక్కువ పెంచుకొన్న ఆయన ముంబై ఐఐటీలో చేరారు. ఇక్కడ అనేక రకాల పరిశోధనలు చేసిన రింటి బెనర్జీ.. ఇప్పటివరకు పలు పరిశోధనలపై అనేక పేటెంట్లను కూడా పొందాడు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడటాన్ని గమనించిన రింటి బెనర్జీ.. గత మూడు నెలలు తీవ్రంగా శ్రమించి ఒక రసాయనాన్ని తయారుచేశాడు. ఈ రసాయనాన్ని కరోనా వైరస్ కలిగివున్న వస్త్రంపై పూసిన వెంటనే ఆ వైరస్‌ వెంటనే కనుమరుగై పోతోంది.

మాస్కులు, పీపీఈ కిట్లు, స్పోర్ట్స్ గ్లోవ్స్ లేదా సాధారణంగా ఉపయోగించే దుస్తులపై కూడా ఈ రసాయనాన్ని ఉపయోగించవచ్చునని, దీనిని డ్యూరాప్రోట్ పూత అంటారని రింటి బెనర్జీ చెప్తున్నారు. సాక్స్, లోదుస్తుల నుండి వచ్చే చెమట వాసనను తొలగించడానికి ఈ యాంటీ బాక్టీరియల్ రసాయనాన్ని పరిశోధించానని డాక్టర్ రింటి చెప్పారు. అయితే ఇదే సమయంలో దేశంలో కోవిడ్ -19 సంక్షోభం ప్రారంభం కావడంతో పరిశోధనల దృష్టిని దానిపైకి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఈ పరిశోధనా ఫలితాలను సౌత్‌ఇండియా టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ బేరీజు వేసి.. ఈ రసాయనం శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టంచేశారు.

ముంబైలోని కరోనా చికిత్సకు ప్రధాన కేంద్రమైన కస్తూర్బా దవాఖానలో ఈ రసాయనాన్ని పూసిన మాస్కులను వినియోగించి ఫలితాలను రాబట్టారు. నోరు లేదా ముక్కు నుంచి విడుదలయ్యే డ్రాప్ లాట్స్‌లో ఉన్న కొవిడ్ -19 వైరస్ ఈ రసాయనానికి గురైనప్పుడు తొలిగిపోయిందని వైద్యులు కూడా గుర్తించారు. డాక్టర్ రింటి బెనర్జీ పరిశోధన ఏ వాణిజ్య ఒప్పందంలోనూ భాగం కాలేదు. సామాజిక ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ రసాయనాన్ని సిద్ధం చేశారు. దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు. కాబట్టి మాస్కులు, పీపీఈ కిట్లు, వస్త్రాలను తయారుచేసే సంస్థలు ఈ ప్రొఫెసర్‌తో సంప్రదించి అనుమతి పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. గుజరాత్ కు చెందిన ఓ మాస్కుల తయారీదారు కూడా ఈ రసాయనాన్ని ఉపయోగించి మాస్కులు, ఇతర వస్తువులు తయారుచేస్తున్నట్టు సమాచారం.


logo