బుధవారం 08 జూలై 2020
Science-technology - May 07, 2020 , 14:29:15

ఇస్రోకు క‌రోనా ఎఫెక్ట్

ఇస్రోకు క‌రోనా ఎఫెక్ట్

నెల్లూరు: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కరోనా ఎఫెక్ట్ తగిలింది. క‌రోనా సంక్షోభంతో రాకెట్ ప్ర‌యోగాలు వాయిదా ప‌డుతున్నాయి. గతేడాది ఏడు రాకెట్ ప్రయోగాలు చేసిన ఇస్రో.... ఈ ఏడాది ఇప్పటి వరకు విదేశాల నుంచి ఒకే ఒక్క ప్రయోగం చేసింది. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన మానవసహిత ప్రయోగానికి ఆటంకం ఏర్పడింది. శిక్షణ కోసం ముగ్గురు వ్యోమగాములు రష్యాకు వెళ్లగా...అక్కడ కరోనా కారణంగా వారి శిక్షణ నిలిచిపోయింది. మరోవైపు షార్ కేంద్రంలోని ప్రైవేటు సంస్థల్లో దాదాపు 800 వందల మందికి పైగా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా కారణంగా వారంతా తమ ప్రాంతాలకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.logo